Begin typing your search above and press return to search.

ఆదిత్య థాకరే పై కంగనా సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   14 Sept 2020 11:01 PM IST
ఆదిత్య థాకరే పై కంగనా సంచలన ఆరోపణలు
X
సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో ఉద్ధవ్ థాకరే సర్కార్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి బాల్ థాకరే పడ్డ కష్టానికి ఇపుడు ఉద్ధవ్ ఫలాలు అనుభవిస్తున్నారంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సుశాంత్ సూసైడ్ వ్యవహారంతో సీెఎం ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరేకు లింకు ఉందని కంగనా గతంలో సంచలన ఆరోపణలు చేసింది. ముంబైని వీడి వెళుతున్నానని ట్వీట్ చేసిన కొద్ది సేపటికే కంగనా....తాజాగా మరో సంచలన ట్వీట్ చేసింది. సుశాంత్ ను హత్య చేసిన వారితోపాటు మూవీ మాఫియా, డ్రగ్ రాకెట్ వంటి వ్యవహారాలను బయటపెడతానంటూ తాను వ్యాఖ్యానించానని, బాలీవుడ్ మూవీ మాఫియాతో మహారాష్ట్ర సీఎం ముద్దుల కొడుకు ఆదిత్య థాకరే కలిసి తిరుగుతుంటాడని షాకింగ్ ట్వీట్ చేసింది. అలా వ్యాఖ్యానించడమే తాను చేసిన పెద్ద నేరమని, అందుకే తనపై మహారాష్ట్ర సీఎం కక్ష సాధిస్తున్నారని, తనను సరిదిద్దాలని చూస్తున్నారని ట్వీట్ చేసింది. ఎవరిని ఎవరు సరిచేస్తారో చూద్దామంటూ కంగనా చేసిన ట్వీట్ వైరల్ అయింది.

ఆదిత్య థాకరే పై కంగనా గతంలోనూ పరోక్షంగా పలు సంచలన ఆరోపణలు చేసింది.జూన్ 13వ తేదీన ఆదిత్య థాకరే బర్త్ డే అని, జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ సమయంలో అతడి ఫ్లాట్ దగ్గర సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదని, ఆ తర్వాత ప్రభుత్వ అంబులెన్స్ లో సుశాంత్ ను థాకరే సెటప్ చేసిన కూపర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ను కంగనా షేర్ చేసింది. ప్రతీ ఒక్కరికి ఈ విషయం తెలుసని, కానీ ఎవరూ తన పేరు మాత్రం చెప్పరని కంగనా ట్వీట్ చేసింది. కరణ్‌ జోహార్‌ ప్రాణ స్నేహితుడు, ప్రపంచంలోనే గొప్ప ముఖ్యమంత్రి గొప్ప కొడుకు.. ఆయనను అంతా ప్రేమగా బేబీ పెంగ్విన్‌ అని పిలుస్తారంటూ ఆదిత్య థాకరేను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేసింది. నెటిజన్లు బేబీ పెంగ్విన్ అంటూ ఆదిత్యను సోషల్ మీడియాలో కామెంట్ చేయడంతో కంగన పరోక్షంగా ఆదిత్యనుద్దేశించి ట్వీట్ చేయడం దుమారం రేపింది. మరి, తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్, శివసేనల స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి.