Begin typing your search above and press return to search.

మ‌నాలి ఇంట్లో కిక్ బాక్సింగ్ చేస్తున్న యాక్ష‌న్ క్వీన్

By:  Tupaki Desk   |   16 Oct 2020 1:00 PM GMT
మ‌నాలి ఇంట్లో కిక్ బాక్సింగ్ చేస్తున్న యాక్ష‌న్ క్వీన్
X
ఇండియ‌న్ వెర్ష‌న్ లో మొట్ట‌మొద‌టి సూప‌ర్ గాళ్ ఎవ‌రు? అంటే క్వీన్ కంగ‌న పేరే చెప్పాలి. క్రిష్ 3లో సూప‌ర్ ట్యాలెంట్ తో యాక్ష‌న్ క్వీన్ గా అద‌ర‌గొట్టింది. ఆ త‌ర‌హా ఫిక్ష‌న‌ల్ క్యారెక్ట‌ర్లు ఏవీ అంత భారీత‌నంతో అంత‌కుముందు మ‌న‌వాళ్లు ఎవ‌రూ చేయ‌లేదు. 2.0లో ఎమీజాక్స‌న్ ఎంట్రీ ఇచ్చేవ‌ర‌కూ అస‌లు సూప‌ర్ గాళ్ అన్న ప‌దానికి ఇక్క‌డ అంత‌గా ఇమేజ్ లేనే లేదు.

ఇప్పుడు క్వీన్ కంగ‌న ర‌నౌత్ మ‌నాలి ఇంట్లో చేస్తున్న ఆ ప‌ని చూస్తే క‌చ్ఛితంగా సూప‌ర్ గాళ్ అని కానీ సూప‌ర్ ఉమెన్ అని కానీ పిలిచేందుకు అన్నిర‌కాలా అర్హ‌త‌లు క‌లిగి ఉన్న భామ అని ఒప్పుకుని తీరాల్సిందే. కంగ‌న కేవ‌లం నోటికే ప‌ని చెబుతుంద‌ని అనుకునేవాళ్ల‌కు క‌నువిప్పు ఈ వీడియో. చూస్తున్నారు గా కిక్ లు పంచ్ ల‌తో హోరెత్తిస్తోంది. ఓవైపు బాక్సింగ్ .. ఇంకోవైపు మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్.. మ‌రోవైపు కాలిని అంతెత్తున లేపి ఎలా పంచ్ లు ఇస్తోందో. ప‌ర్ఫెక్ట్ సూప‌ర్ ఉమెన్ కంగ‌న అని అంగీక‌రించి తీరాల్సిందే.

ఇటీవ‌లే తలైవి చిత్రీక‌ర‌ణ‌ను ముగించుకుని మ‌నాలి ఇంటికి వెళ్లిపోయిన కంగ‌న త‌న ఖాళీ స‌మ‌యాన్ని ఇలా స‌ద్వినియోగం చేసుకుంటోంది. తలైవిలో జయలలిత పాత్రలో నటించడానికి 20 కిలోల బరువు పెరిగిందిట‌. అయితే ఇప్పుడు ఆ బ‌రువంతా తిరిగి ఇలాక‌రిగించేస్తోంది. త‌దుప‌రి తేజస్ .. ధాకడ్ అనే రెండు భారీ చిత్రాలలో నటించనుంది. ఈ సినిమాల్లో సైనికురాలిగా.. గూఢ‌చారిగా నటిస్తోంది. అందుకే ఇప్పుడు త‌న రూపం మార్చుకోవాల‌నుకుంటోంద‌ట‌. ఈ రెండు సినిమాల్లోనూ భారీ యాక్ష‌న్ ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని చెబుతున్నారు. కంగ‌న యోగా ప్ల‌స్ మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ లో రాటు దేలుతున్న తీరు చూస్తుంటే బాలీవుడ్ ని మునుముందు గ‌డ‌గ‌డ‌లాడించేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.