Begin typing your search above and press return to search.

మంచుకొండ‌ల్లో.. కంగ‌నా స్వ‌ర్గ‌సీమ‌!

By:  Tupaki Desk   |   16 April 2021 7:00 AM IST
మంచుకొండ‌ల్లో.. కంగ‌నా స్వ‌ర్గ‌సీమ‌!
X
'ఇల్లే క‌దా స్వ‌ర్గ‌సీమ' అన్నాడో సినీ క‌వి. నిజ‌మే క‌దా.. ఇల్లు ఎంత సౌక్యంగాఉంటే.. అంత మ‌న‌శ్శాంతిగా ఉంటుంది. దేశంలోని అద్భుత హాలిడే డెస్టినేష‌న్లలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మనాలికి ప్రత్యేక స్థానం ఉంది. అక్క‌డికి వెళ్లిన వారికి అంత త్వ‌ర‌గా ఆ ప్రాంతాన్ని వ‌ద‌ల‌డానికి మ‌న‌సురాదు. అలాంటిది.. అక్క‌డే శాశ్వ‌తంగా ఉండిపోయే ఛాన్స్ ఉంటే?

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఆ అవ‌కాశాన్ని సృష్టించుకుంది. ఆమెకు కూడా ఈ ప్రాంతం ఎంత న‌చ్చిందోగానీ.. ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి అద్భుత‌మైన స్వర్గ‌సీమ‌ను నిర్మించుకుంది కంగ‌నా!

రూ.30 కోట్లు ఖ‌ర్చు పెడితే.. ఇక‌, ఆ ఇంటికి వంక పెట్ట‌డానికి ఏముంటుంది చెప్పండి? స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన ఈ ఇంట్లోకి 2018లో ప్ర‌వేశించింది కంగ‌నా. ఈ ఇంట్లో మొత్తం 7 బెడ్ రూమ్ లు, 7 బాత్ రూమ్ లు ఉన్నాయి. ఇక‌, హాల్ లో నిల‌బ‌డితే.. హిమాల‌యాల‌ను చూస్తూ ప‌ర‌వ‌శించి పోవ‌చ్చు.లోప‌ల ఇంటీరియ‌ర్ డిజైన్స్‌, వాల్‌ పెయింటింగ్స్‌, త‌దిత‌రాలు మ‌దిని దోచేసేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.