Begin typing your search above and press return to search.

అందరూ సారీ చెప్పారు.. కాని..

By:  Tupaki Desk   |   22 July 2017 7:27 AM GMT
అందరూ సారీ చెప్పారు.. కాని..
X
బాలీవుడ్ కమర్షియల్ హీరోయిన్ కావడం అంటే అది ఏమి అంతా చిన్న విషయం కాదు అనే చెప్పాలి. విశ్వ సుందరిలకు సూపర్ మోడల్ లు కూడా ఆ స్థాయి కి వెళ్ళటానికి చాలా కష్టపడతారు. అటువంటిది ఒక చిన్న టౌన్ నుండి వచ్చి చిన్న సినిమా హీరోయిన్ గా మొదలిపెట్టి కోట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టే హీరోయిన్ ఎదిగిన కంగనా రనౌత్ అంటే చాలా మందికి గౌరవం అభిమానం. క్వీన్ సినిమాతో మళ్ళీ వెనకకు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. కాకపోతే ఒక ఫేమస్ టాక్ షోలో బాలీవుడ్ లో వివక్షత ఎక్కువగా ఉందిని మన ప్రొడ్యూసర్ హీరోలలో అయితే పక్షపాతం - బంధు ప్రీతి ఇంకా ఎక్కువ అని మాట్లాడి పెద్ద చర్చకు కు కేంద్ర బిందువు అయ్యింది.

కాఫీ విత్ కరణ్ లో ప్రోగ్రామ్ లో కంగన ఆ కామెంట్లు చేయడంతో.. చాలా ఇంటర్వ్యూ లో కరణ్ జోహర్ తన వివరణ ఇచ్చాడు. అలాగే ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఈమెపై జోకులు సెటైర్లు వేశాడు. కాకపోతే బాలీవుడ్ లో పక్షపాతం ఎక్కువగా ఉంది అని ప్రశ్నించిన కంగనానే ఇప్పుడు తన చేస్తున్న పనులలో అది చూపిస్తుంది అని చెబుతున్నారు. కంగనాకు సంబందించిన ఈవెంట్ లు గురించి కానీ షోలు విషయం గాని తన చెల్లెలే అన్నీ చూసుకునేది. ఇప్పుడు ఆమె వెళ్లిపోయాక ఆమె అన్నయ్య అక్షిత్ చూసుకుంటున్నాడు. అంటే ఇక్కడ కంగనా కూడా తన చేస్తున్న పనులలో తనకు కావలిసినవాళ్లని పెట్టుకుంది కదా అని కొందరు వాదిస్తున్నారు. మనం ఎవరి తప్పులు అయన ఎత్తి చూపినప్పుడు ముందు మనం ఎంతవరకు సరిగా ఉన్నమో చూసుకోవాలి అని కూడ హితవు పలుకుతున్నారు కొంతమంది.

కాఫి విత్ కరణ్ షో లో మాట్లాడినప్పటి నుండి బాలీవుడ్ లో ఇది ఒక నిరంతర చర్చకు దారి తీసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కంగనా పై ఈ విదంగా ఎదురుదాడికి దిగుతున్నారు మరికొందరు. ఇకపోతే కంగన ఇవన్నీ కొట్టిపారేస్తున్నా కూడా.. తామె చేసిన 'నెపోటిజం రాక్స్' కామెంట్లకు కరణ్ జోహార్ కూడా సారి చెప్పినా కూడా.. బాలీవుడ్లో ఒక్కసారి క్లిక్ అయిన ఎవరైనా వారి చుట్టాలనూ బంధుగణాన్ని డెఫినెట్ గా అక్కడ దించేస్తున్నారు. ఆ మాటకు వస్తే టాలీవుడ్ లో కూడా అంతేగా!!