Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ వెద‌ర్ కి మంత్ర‌ముగ్ధురాలై క్వీన్ క‌విత్వం

By:  Tupaki Desk   |   12 Oct 2020 1:00 PM IST
హైద‌రాబాద్ వెద‌ర్ కి మంత్ర‌ముగ్ధురాలై క్వీన్ క‌విత్వం
X
‘తలైవి’ హైదరాబాద్ షెడ్యూల్ ముగించిన మ‌రునాడు కంగనా రనౌత్ తిరిగి త‌న హోమ్ టౌన్ మనాలికి వెళ్లిపోయారు. అక్క‌డ హైద‌రాబాద్ వాతావ‌ర‌ణంపై క్వీన్ ఏకంగా క‌విత‌లే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. `హిమాలయాల శరదృతువు` ను ఆస్వాదించాను అంటూ ఒక వీడియోని కంగ‌న షేర్ చేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత బయోపిక్ లో న‌టిస్తున్న ‘క్వీన్’ తన గది బాల్కనీ నుండి హిమాలయాల వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇంటికి తిరిగి రావాలని అనుకున్నాను. ``హైద‌రాబాద్ అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ తిరిగి హిమాలయ శరదృతువు.. శీతాకాలంలో మంచు కరుగుతోంది. సూర్యుడు ఇలా ప్రకాశిస్తున్నప్పుడు అది మంత్రముగ్ధులను చేస్తుంది. ఉదయపు సూర్యుడి వెచ్చదనం తో కొంచెం చల్లద‌నం మిళితం అవుతుంది`` అంటూ ఎగ్జాక్ట్ హైద‌రాబాద్ వాతావ‌ర‌ణంపై క‌విత‌ను చెప్పింది కంగ‌న‌. అన్న‌ట్టు హైద‌రాబాద్ లో రియ‌ల్ వెంచ‌ర్లు ఎక్కువై ప‌దేళ్ల నాటి వాతావ‌ర‌ణం ఇప్పుడు లేనేలేదు. ఇక్క‌డా శీతాకాలం కూడా చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయ్. వేడి పెరిగి రోత‌గా మారింద‌న్న విమ‌ర్శ‌లు ఇటీవ‌ల వెల్లువెత్తుతున్నాయి. అయితే కంగ‌న ల‌క్కీగా ఈ వ‌ర్షాల సీజ‌న్ లో హైద‌రాబాద్ ని ఆస్వాధించింది.

ఇక మూవీ సంగ‌తి చూస్తే... జయలలితగా ఆమె లుక్ కి సంబంధించిన‌ అనేక చిత్రాలను ఇదివ‌ర‌కూ ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన కంగ‌న‌.. ఈ చిత్రం కోసం మరో షెడ్యూల్ పూర్తి చేసినట్లు ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత కంగనా ఇటీవల తిరిగి షూటింగ్ ప్రారంభించింది. ‘తలైవి’ చిత్రీకరణ కోసం హైద‌రాబాద్ లో అడుగు పెట్టింది. ‘తలైవి’ కి ‘బాహుబలి’- ‘మణికర్ణిక’ చిత్రాల‌ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ క‌థ‌ను అందించారు. ‘ది డర్టీ పిక్చర్’...., ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ రచయిత రజత్ అరోరా స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రం 26 జూన్ 2020న థియేటర్లలోకి రానుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా హాళ్ళు మూసివేసి ఈ నెల‌లో తెరుస్తున్న సంగ‌తి తెలిసిందే.