Begin typing your search above and press return to search.

ఇమేజ్ డ్యామేజ్ కోసం హ్రితిక్ ప్లాన్!!

By:  Tupaki Desk   |   23 April 2016 9:42 AM IST
ఇమేజ్ డ్యామేజ్ కోసం హ్రితిక్ ప్లాన్!!
X
బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ ల మధ్య వ్యవహారం రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. ఈ విషయంలో ఎవరికి వారు తమదే పై చేయి అన్నట్లుగా బిహేవ్ చేస్తుండడం.. వివాదం ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా కంగనా పంపిన మెయిల్స్ - మెసేజెస్ అంటూ కొన్ని ఈమెయిల్స్ నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఈమెయిల్ కాపీలు మీడియాలోకి వచ్చిన తర్వాత.. ఒక్కసారిగా అంతా హృతిక్ రోషన్ పైనే సానుభూతి చూపే సిట్యుయేషన్ వచ్చింది. హృతిక్ నే కరెక్ట్ అంటున్నారు జనాలు కూడా. సరిగ్గా ఇలా అనుకునేందుకే, కంగనా ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు.. హృతిక్ ఆడుతున్న డ్రామా ఇదంతా అంటున్నాడు కంగనా లాయర్.

ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎఫ్ ఐఆర్ కూడా నమోదు కాలేదని, కంగనా స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయడం కూడా జరగలేదని.. అంటున్నాడీ లాయర్. ఇలాంటి సమయంలో ఫోరెన్సిక్ రిపోర్టులు అంటూ లీకులు ఇవ్వడం, నమ్మశక్యంకాని విధంగా మీడియాకి ఈమెయిల్ కాపీలు ఇవ్వడం అంటే.. హృతిక్ రోషన్ ఎంతకైనా తెగించాడనే అర్ధం అన్నది కంగనా తరఫు న్యాయవాది వాదన. ఈయన ఇచ్చిన సుదీర్ఘమైన వివరణతో.. ఈ కేసు మరో కొత్త టర్న్ తీసుకున్నట్లు అయింది.