Begin typing your search above and press return to search.

లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన కంగన

By:  Tupaki Desk   |   5 April 2016 11:02 PM IST
లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన కంగన
X
హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య వార్ తీవ్రమైన స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు - లీగల్ నోటీసులు - ప్రెస్ స్టేట్ మెంట్లు తర్వాత.. ఇప్పుడు ఫైనల్ వార్నింగ్ లు ఇచ్చుకునే పరిస్థితి వరకూ వచ్చేసింది.

తన క్లయింట్ ను 'సిల్లీ ఎక్స్' అన్నందుకు గాను క్షమాపణ చెప్పి, లీగల్ నోటీసును వాపసు తీసుకోకపోతే.. హృతిక్ రోషన్ తగిన చర్యలకు సిద్ధం కాక తప్పదని అంటున్నాడు కంగనా రనౌత్ లాయర్. జనవరి 1న తానిచ్చిన లీగల్ నోటీసుకు హృతిక్ సమాధానం ఇవ్వలేదు కాబట్టి.. కోర్టు కేసులకు సిద్ధం కావాల్సి ఉంటుందని లాయర్ సిద్ధిఖీ చెబుతున్నాడు. ఇద్దరూ కలిసి జీవించేసి, తర్వాత విడిపోయి రచ్చ చేసేసుకున్నారు ఈ బాలీవుడ్ స్టార్స్. ఈ వివాదంలో ఇప్పటికే ఓసారి హృతిక్ సారీ కూడా చెప్పాల్సి వచ్చింది.

తామిద్దరి మధ్య గొడవలోకి పోప్ ను లాగడంతో.. ఆ మతస్తుల మనోభావాలు దెబ్బతీశాడనే ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ లీగల్ నోటీసును ఇచ్చింది ఓ క్రైస్తవ సంస్థ అయినా.. దాన్ని పంపినది కూడా కంగనా తరఫు లాయరే కావడం విశేషం. మరిప్పుడు కంగనాకి కూడా ఓ సారి చెప్పేసి వివాదాన్ని ముగిస్తాడో.. లేక కోర్టుకెక్కేందుకు హృతిక్ రెడీ అవుతాడో చూడాలి.