Begin typing your search above and press return to search.

కంగ‌న సెటైర్‌: అదంతా అమీర్ ప‌న్నిన ప‌న్నాగం

By:  Tupaki Desk   |   4 Aug 2022 4:17 AM GMT
కంగ‌న సెటైర్‌: అదంతా అమీర్ ప‌న్నిన ప‌న్నాగం
X
ఈరోజుల్లో సినిమాల‌కు ప్ర‌చారం కావాలంటే ఏదో ఒక గిమ్మిక్ త‌ప్ప‌నిస‌రి. సినిమాలో కంటెంట్ తో రిలీజ్ ముందే జ‌నాల‌కు ఎక్కించ‌డంలో స‌క్సెసైనా అవ్వాలి.. లేదా వివాదాల‌తో నిరంత‌రం హెడ్ లైన్స్ లో అయినా నిల‌వాలి. అయితే ఈసారి మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ రెండో మార్గాన్నిఅనుస‌రిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

`లాల్ సింగ్ చడ్డా`ను బహిష్కరించాల‌నే ధోర‌ణి వెన‌క మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గిమ్మిక్ ఉంద‌ని తాజాగా క్వీన్ కంగ‌న ర‌నౌత్ బిగ్ పంచ్ వేసారు. హాలీవుడ్ రీమేక్ ఎలాగూ పని చేసి ఉండేది కాదని కూడా కంగ‌న విమ‌ర్శించారు. అతడు స్వ‌యంగా ఈ ధోరణిని ప్రారంభించాడని కంగన్ రనౌత్ ఇటీవల పేర్కొంది.

1994లో టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ కి అధికారిక హిందీ రీమేక్ ఇది. ప్రస్తుతం అభిమానులు లాల్ సింగ్ చడ్డా అని పిలుస్తున్నారు. ఈ సినిమాను బహిష్కరించాలని కోరుతున్నారు. అయితే దీనిపై కంగ‌న త‌న‌దైన శైలిలో సెటైర్లు వేసింది. థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న `లాల్ సింగ్ చడ్డా` చుట్టూ ఉన్న ప్రతికూలతను మ్యానేజ్ చేయ‌డానికి మాస్టర్ మైండ్ అమీర్ ఖాన్ జీ ప‌న్నిన ప‌న్నాగ‌మిద‌ని కంగ‌న అన్నారు.

ఈ సంవత్సరం హిందీ చిత్రాలేవీ (కామెడీ సీక్వెల్ భూల్ భుల‌యా మినహా) బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన లేదా స్థానికత‌తో అభిరుచిని కలిగిన దక్షిణాది సినిమాలు మాత్రమే బాగా ఆడుతున్నాయి. హాలీవుడ్‌ రీమేక్‌ ఎలాగూ వ‌ర్క‌వుట్ కాదు.. అందుకే ఈ గిమ్మిక్! అని కంగ‌న‌ అన్నారు. మూవీ రిలీజ్ ముందు ఇప్పుడు వారు(అమీర్) భారతదేశాన్ని `అసహనం` అంటారు...!! అంటూ పరోక్షంగా అమీర్ ఖాన్ గ‌తాన్ని త‌వ్వింది కంగ‌న‌.

నిజానికి హిందీలో సినిమాలు తీసేవాళ్లు ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకోవాలి. అది హిందువు లేదా ముస్లిం కాదు. అమీర్ ఖాన్ జీ హిందూఫోబిక్ PK చేసిన తర్వాత లేదా భారతదేశాన్ని ఒక `అసహనం` అని కామెంట్ చేశాక‌ అతను అతిపెద్ద హిట్స్ ఇచ్చాడు... నేను అనేది అతని జీవితం గురించి...!! అంటూ ప‌రోక్షంగా కిర‌ణ్ రావుతో విడాకుల గురించి కూడా కంగ‌న త‌వ్వి తీసింది. దయచేసి దానిని మతం లేదా భావజాలం అంటూ చెప్పడం మానేయండి. వారి (అమీర్ స‌హా బాలీవుడ్ మాఫియా) చెడు నటన .. చెడు చిత్రాలకు విజ‌యం ఎప్పుడూ దూరం! అని కూడా అంది.

లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న విడుదల కానుంది. ఇంటర్నెట్ వినియోగదారులు #BoycottLaalSinghChaddha అనే హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి సినిమాను బహిష్కరిస్తున్నారు. ఇటీవల అమీర్ తన సినిమాను బహిష్కరించవద్దని నెటిజన్లను అభ్యర్థించాడు. సినిమాను బహిష్కరించాలని చెబుతున్న చాలా మంది తనకు ఇండియా అంటే ఇష్టం లేదని నమ్ముతున్నందుకు బాధగా ఉందని అన్నారు. అతను తన దేశాన్ని చాలా ప్రేమిస్తానని కూడా చెప్పాడు.

గత కొంత కాలంగా కొన్ని బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి రాకుండా ఆగిపోయాయి. భూల్ భులయ్య 2- ది కాశ్మీర్ ఫైల్స్- గంగూబాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద చక్క‌ని వ‌సూళ్ల‌ను సాధించాయి... అని అమీర్ అన్నారు. లాల్ సింగ్ చద్దా చిత్రం కోసం కరీనా నేను మళ్లీ కలిశాం. తలాష్ - 3 ఇడియట్స్ తర్వాత మూడవ సారి క‌లిసి న‌టించామ‌ని తెలిపారు. లాల్ సింగ్ చద్దా చిత్రానికి అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహించారు. మోనా సింగ్ - నాగ చైతన్య కీలక పాత్రల్లో నటించారు.