Begin typing your search above and press return to search.

తనపై విమర్శలు ఆపకుంటే అందరి బండారం బయట పెడతానంటోంది

By:  Tupaki Desk   |   1 Aug 2020 10:00 AM IST
తనపై విమర్శలు ఆపకుంటే అందరి బండారం బయట పెడతానంటోంది
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ గురించి ఏదైనా చిన్న విమర్శ చేయాలన్నా కూడా స్టార్స్‌ భయపడతారు. ఎందుకంటే ఆమెతో పెట్టుకుంటే ఒక్క మాటకు పది మాటలు అంటుంది. దాంతో పరువు పోతుందని స్టార్స్‌ భయపడుతారు. అందుకే ఈమె ఎంతగా విమర్శలు చేసినా కూడా డైరెక్ట్‌ గా మాత్రం ఏ ఒక్క స్టార్‌ ఆమె విమర్శలకు సమాధానం ఇవ్వరు. అయితే వారి అభిమానుల పేరుతో కొందరు కంగనాను ట్రోల్స్‌ చేయడం జరుగుతూ ఉంటుంది.

ఇటీవల సుశాంత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌ మాఫియా అంటూ కంగనా తీవ్ర స్థాయిలో కొందరిపై విమర్శలు చేస్తున్నారు. కొందరు దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్స్‌ నెపొటిజంను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారో చూడవచ్చు అంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శల మీద విమర్శలు చేస్తూనే ఉంది. ఈమద్య ఆమెను కొందరు టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారు. కంగనాను టార్గెట్‌ చేసిన వారు ఆమె గురించి కొన్ని పుకార్లను ప్రచారం చేస్తున్నారట.

తనపై వస్తున్న పుకార్లపై కంగనా సీరియస్‌ అయ్యింది. తన గురించి ప్రచారం చేస్తున్న పుకార్లను ఆపేయకుంటే పరిణామాలు సీరియస్‌ గా ఉంటాయని హెచ్చరించింది. బాలీవుడ్‌ స్టార్స్‌ కు సంబంధించిన రహస్యాలు అన్ని కూడా నేను బయటకు వదులుతాను. అక్రమ సంబంధాలు మరియు డ్రగ్స్‌ ఇతర చెడు అలవాట్ల గురించి నేను మీడియా ముందుకు తీసుకు వస్తానంటూ హెచ్చరించింది. మొత్తంగా తన గురించి బ్యాడ్‌ ప్రచారం చేస్తున్న స్టార్స్‌ బండారం బయట పెడతానంటూ పేర్కొంది. దాంతో కంగనా వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నిజంగానే కంగనా అంత పని చేస్తుందా అనేది చూడాలి.