Begin typing your search above and press return to search.
స్టార్ హీరోపై మళ్లీ సెటైర్లతో విరుచుకుపడిన కంగన
By: Tupaki Desk | 15 Dec 2020 7:10 PM ISTబాలీవుడ్ కండల హీరో హృతిక్ తో కంగన వివాదం గురించి తెలిసినదే. క్రిష్ 3 సమయంలో హృతిక్ రోషన్ తనతో ప్రేమలో ఉన్నాడని కొంతకాలం పాటు డేటింగ్ చేశామని అయితే ఆ తర్వాత అతడితో విభేధాలు తలెత్తాయని కంగన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సుహానేతో హృతిక్ విడాకులకు కారణం అతడికి మగువలతో ఉండే ఎఫైర్లే కారణమని కూడా కంగన విమర్శించడం అప్పట్లో జాతీయ మీడియాలో సంచలనమే అయ్యింది.
చాలా కాలంగా కంగనపై హృతిక్ కోర్టుల పరిధిలో ఫైట్ చేస్తూనే ఉన్నారు. తన మర్యాదకు భంగం కలిగిస్తున్న కంగనపై ఇప్పటికీ ఫిర్యాదులు అలానే ఉన్నాయి. తనకు కంగనాతో ఎటువంటి సంబంధం లేకున్నా ఆమె జీమెయిల్ అకౌంట్ నుంచి వందల సంఖ్యలో మెయిళ్లు వచ్చాయని అది తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని 2016లో హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదు. ఇప్పటికైనా దానిపై దృష్టి సారించాలంటూ హృతిక్ తరఫు లాయర్ మహేష్ జెఠ్మలానీ ముంబై పోలీసులకు తాజాగా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కంగనా ట్విటర్ లో మరోసారి పంచ్ లతో విరుచుకుపడింది.
``అతడితో విడాకులు అయిన చాలా ఏళ్ల తర్వాతా మళ్లీ ఏడుపు గొట్టు కథ మొదలైంది. మాకు బ్రేకప్ అయ్యి చాలా ఏళ్లయ్యింది. అయినా ఇంకా అతడు ఏ స్త్రీతో డేటింగ్ చేయడానికైనా నిరాకరిస్తున్నాడు. నా వ్యక్తిగత జీవితంలో ధైర్యంగా ముందుకెళుతుంటే.. అతడి డ్రామా మళ్లీ మొదలైంది. ఆ చిన్నపాటి అఫైర్ గురించి ఇంకెంత దూరం వెళ్తావు హృతిక్?`` అంటూ మరోసారి విరుచుకుపడింది కంగన.