Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్య! వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత క్వీన్ ఇన్నాళ్టికి!!

By:  Tupaki Desk   |   4 July 2022 2:30 AM GMT
హ‌మ్మ‌య్య! వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత క్వీన్ ఇన్నాళ్టికి!!
X
2020-21 క‌రోనా సీజ‌న్ లో వ‌ర‌స చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది క్వీన్ కంగ‌న ర‌నౌత్. ఓవైపు `త‌లైవి` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన కంగ‌న `ధాక‌డ్` లాంటి భారీ మాస్ యాక్ష‌న్ చిత్రంలో యాక్ష‌న్ క్వీన్ గా ధ‌డ పుట్టించింది. కానీ ఇవి రెండూ ప‌రాజ‌యం పాల‌య్యాయి. ఈ ఏడాది ఓటీటీ లో `లాక‌ప్` పేరుతో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స‌క్సెసైనా కానీ సినిమాల‌తో హిట్లు కొట్ట‌లేక‌పోయింది.

ముఖ్యంగా ధాక‌డ్ ఘోర ప‌రాజ‌యం చూసాక కంగ‌న‌కు నోట మాట రాలేదు. మార్కెట్లో త‌న బ్రాండ్ ఇమేజ్ మొత్తం తునాతున‌క‌లైంది. 90 కోట్ల బ‌డ్జెట్ పెట్టిన సినిమాకి కేవ‌లం 3 కోట్ల షేర్ వ‌చ్చిందంటే ఎంత‌టి డిజాస్ట‌రో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ మూవీ ప‌రాజ‌యంతో కొంత‌కాలంగా కంగ‌న సౌండ్ లేకుండా ఉంది. ఇటీవ‌లే మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు వేళ కాస్త సౌండ్ చేసింది కానీ మ‌రొక‌ర‌కంగా సంద‌డి అయితే లేదు.

ఎట్ట‌కేల‌కు కంగ‌న సైలెంట్ గా త‌న కొత్త సినిమాని ప్రారంభించింది. కంగనా రనౌత్ తన హోమ్ బ్యానర్ మణికర్ణిక ఫిలింస్ లో కొత్త సినిమా చేస్తున్నట్లు ఇంత‌కుముందే క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఈ రోజు కంగ‌న తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి `ఎమర్జెన్సీ` అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు కంగ‌న‌. ఈ చిత్రం అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభ‌మైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ కంగ‌న‌ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోని షేర్ చేసింది.

అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం కంగ‌న స్వ‌యంగా మళ్లీ మెగాఫోన్ చేపట్టింది. మ‌ణిక‌ర్ణిక త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి సాహ‌సానికి కంగ‌న పూనుకుంది. టెస్టూవో నాగతా సినిమాటోగ్రఫీ అందించ‌నుండ‌గా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వ‌ర‌లో ప్రకటించనున్నారు.