Begin typing your search above and press return to search.

కూల్చిన బిల్డింగ్ పై కంగన సరికొత్త వాదన

By:  Tupaki Desk   |   10 Sept 2020 10:00 PM IST
కూల్చిన బిల్డింగ్ పై కంగన సరికొత్త వాదన
X
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రౌనత్ మహారాష్ట్ర శివసేన సర్కార్ ను అల్లాడిస్తోంది. సవాల్ చేసి మరీ ముంబై వచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో శివసేన సర్కార్ ను కార్నర్ చేస్తోంది.

ఈ క్రమంలోనే శివసేన కూడా వెనక్కి తగ్గకుండా కంగన రనౌత్ ఇంటిని కూల్చివేసింది. అక్రమ కట్టడం అనే సాకుతో బుధవారం మధ్యాహ్నం కంగన రనౌత్ ఇంటిని నేలమట్టం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్దమయ్యారు. అయితే కోర్టు స్టే కారణంగా కూల్చివేత పనులకు బ్రేక్ పడింది.

ఇక తాజాగా కంగన రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వం, కరణ్ జోహార్ పై నిప్పులు చెరిగింది. శివసేన సర్కార్ నా ఇంటిని కూల్చివేసిందని.. ఇక కరణ్ జోహర్ గ్యాంగ్ నా ముఖాన్ని దేహాన్ని నుజ్జు చేయడమే మిగిలిందని ఫైర్ అయ్యింది. ఆ పని కూడా కానిచ్చేయండని.. మీ బండారం బయటపెట్టకుండా ఉండను అని కంగన రనౌత్ సవాల్ చేసింది.

నా ఇంటితోపాటు మొత్తం ఫ్లాట్ లను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నుంచి కొన్నామని.. అక్రమ కట్టడం అన్న దానికి ఆయనే సమాధానం చెప్పాలని కంగన డిమాండ్ చేశారు.

కాగా మహారాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న శరద్ పవార్ తాజాగా కంగన విమర్శలపై స్పందించారు. ఆమె ఇంటి గురించి తనకు సమాచారం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చివేయవచ్చని వెల్లడించారు.