Begin typing your search above and press return to search.

సోదరుడి పెళ్లి పనుల్లో కంగనా బిజీ.. ఫైర్​బ్రాండ్​ కూలయినట్లేనా

By:  Tupaki Desk   |   12 Nov 2020 3:20 PM IST
సోదరుడి పెళ్లి పనుల్లో కంగనా బిజీ..  ఫైర్​బ్రాండ్​ కూలయినట్లేనా
X
బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రస్తుతం సోదరుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​ లో కంగనా సోదరుడు అక్షత్​ రనైత్​ పెళ్లి జరుగుతున్నది. ఈ పెళ్లి వేడుకను కంగనా దగ్గరుండి చూసుకుంటున్నారు. గురువారం అక్షత్, రీతూ వివాహం బంధంతో ఒకటయ్యారు. కంగనా, ఆమె తల్లిదండ్రులు, సోదరి రంగోలీ చద్దేలి, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కంగనా సోదరుడికి ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన స్నేహితులందరూ తన సోదరుడు అక్షత్, రీతూలను ఆశీర్వదించాలని, వారి కొత్త జీవితం గొప్పగా ఉండాలని దీవించాలని అభిమానులను కోరారు. మెహెందీ ఫంక్షన్‌, సంగీత్‌, ఇలా పెళ్లి వేడుకకు చెందిన అన్ని ఫోటోలను కంగనా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వస్తున్నారు.

తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. సంచలన వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలిచే కంగనా కొద్ది రోజులు గా పెళ్లి వేడుకల్లో మునిగి పోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం పై కంగనా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బాలీవుడ్​లోని డ్రగ్స్​మాఫియా, నెపోటిజం పై కూడా ఆమె విరుచుకు పడ్డారు. ఓ దశలో కంగనా ఏ ట్వీట్​ పెడుతుందోనని బాలీవుడ్​ ప్రముఖలు వణికిపోయారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఆయన కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేను కూడా కంగనా టార్గెట్ చేసింది.

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంగాన పై సీరియస్​ అయ్యింది. ఆమె ఉంటున్న ఆఫీసు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ముంబై మహాపాలకసంస్థ సిబ్బంది దాన్ని పడగొట్టారు. ఓ దశలో కంగనా వర్సెస్​ మహారాష్ట్ర ప్రభుత్వం అన్నస్థాయిలో వార్​ నడిచింది.కేంద్ర ప్రభుత్వం, భారతీయజనతాపార్టీ కంగానాకు సపోర్ట్​ చేసింది. కేంద్రం ఆమెకు పటిష్ఠభద్రతను కూడా ఏర్పాటు చేసింది. అయితే కొంతకాలం క్రితమే కంగనా ముంబైని వీడి వెళ్లింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని టార్గెట్​ చేస్తూనే ఉన్నారు. తాజాగా కొద్దిరోజులుగా కంగనా కూల్​ అయిపోయింది. తన సోదరుడి పెళ్లి పనులతో బిజీ బిజీగా గడుపుతూ వచ్చారు.