Begin typing your search above and press return to search.

పాప్ స్టార్ ని అమెరికాని క‌లిపి తిట్టేసిన క్వీన్ కంగ‌న‌!

By:  Tupaki Desk   |   3 Feb 2021 7:00 PM IST
పాప్ స్టార్ ని అమెరికాని క‌లిపి తిట్టేసిన క్వీన్ కంగ‌న‌!
X
క్వీన్ కంగ‌న నోటి దురుసు గురించి క‌థ‌లు క‌థలుగా ముంబై మీడియా క‌థ‌నాలు అల్లుతోంది. సాటి కొలీగ్స్.. ద‌ర్శ‌కులు.. ర‌చ‌యిత‌లు.. చివ‌రికి రాజ‌కీయ నాయ‌కుల్ని కూడా ఓ ఆటాడుకున్న క్వీన్ .. ఇటీవ‌ల నిరంత‌రం వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా అంత‌ర్జాతీయ పాప్ స్టార్ రిహాన్నాకు కంగ‌న సెగ త‌ప్ప‌లేదు. అస‌లింత‌కీ ఏమైంది? అన్న‌ది ఆరా తీస్తే...

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ నుంచి దిల్లీ శివార్లలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మద్దతుగా అంతర్జాతీయ పాప్ స్టార్ రిహన్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వాలు రైతు వ్య‌తిరేక‌త‌తో ఇంట‌ర్నెట్ ని ష‌ట్ డౌన్ చేయ‌డం స‌రికాద‌ని అభిప్రాయాన్ని రిహానా వ్య‌క్తం చేసింది.

అయితే దీనిని కంగ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. త‌న‌దైన శైలిలో రిహానాను తూర్పార‌బెట్టింది. ఇంత‌కుముందు ఉద్య‌మాలు చేస్తున్న వారు రైతులు కాదు ఉగ్ర‌వాదులు అని వ్యాఖ్యానించిన కంగ‌న‌.. రైతుల‌కు మ‌ద్ధ‌తుగా నిలిచిన రిహాన్నానూ తిట్టేసింది. ఈ వ్య‌వ‌హారం 100 మిలియ‌న్ల రిహాన్నా అభిమానుల‌లో.. అలాగే 3 మిలియ‌న్ల కంగ‌న అభిమానుల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. విదేశీయులు భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని స‌ద‌రు గాయ‌కురాలు మూర్ఖురాలు అని తిట్టేయ‌డం హీటెక్కించింది.

ఉద్య‌మాలు చేసేది రైతులు కాదు. వారు భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు. దీనిపై ఎవ‌రూ మాట్లాడ‌రు. మ‌న దేశాన్ని విచ్ఛిన్నం చేయ‌డం ద్వారా ముక్క‌లుగా బ‌ల‌హీన‌మైన మ‌న‌‌ దేశాన్ని చైనా స్వాధీనం చేసుకుని.. యు.ఎస్.ఏ లాగా చైనా కాలనీగా మార్చగలదు ...!! అంటూ చెల‌రేగింది క్వీన్. మూర్ఖంగా ఉండ‌కండి.. మేము మీ డమ్మీస్ లాగా మా దేశాన్ని అమ్మడం లేదు అంటూ రిహాన్నాని అమెరికాని క‌లిపి తిట్టేసింది కంగ‌న‌. రిహాన్నా సాంగ్ ని పాడిన ట్విట్ట‌ర్ యూజ‌ర్ ని కంగ‌న వ‌దిలిపెట్ట‌లేదు.

హిందూయిజానికి వ్య‌తిరేకంగా మాట్లాడిన ఓ టీవీ షో క‌ర్త‌ను శిరచ్ఛేదనం చేయాలని పిలుపునిచ్చినందుకు గతంలో ట్విట్టర్ లో సస్పెన్షన్ ఎదుర్కొన్న క్వీన్ కంగ‌న‌.. ఈసారి ఇంట‌ర్నెట్ బ్యాన్ ని వ్య‌తిరేకించిన‌ రిహాన్నాను తిట్టే‌య‌డం ఆస‌క్తిక‌రం. ఇంత‌కుముందు రైతుల నిర‌స‌న అంశంలో పంజాబీ గాయకుడు-నటుడు దిల్జిత్ దోసాంజ్ తోనూ కంగ‌న‌ రోజుల తరబడి గొడవ పడిన సంగ‌తి తెలిసిన‌దే.

మంగళవారం మయన్మార్ లో జరిగిన తిరుగుబాటు గురించి ట్వీట్ చేసిన రిహాన్న.. భార‌త‌దేశంలోని రైతుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దిల్లీలో ఇంటర్నెట్ ని మూసివేయడాన్ని ఖండించారు.