Begin typing your search above and press return to search.

కంగ‌న‌కు భ‌య‌ప‌డి దాక్కున్న క‌ర‌ణ్ జోహార్

By:  Tupaki Desk   |   30 April 2022 8:00 AM IST
కంగ‌న‌కు భ‌య‌ప‌డి దాక్కున్న క‌ర‌ణ్ జోహార్
X
కంగనా రనౌత్ తో గొడవ పడకుండా ఉండేందుకు ప్ర‌ముఖ నిర్మాత కరణ్ జోహార్ వేదిక వెన‌క వైపుగా దాక్కున్నాడ‌ట‌. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ కి రాకుండానే అత‌డు గంట విరామం తీసుకున్నారని గుస‌గుస వినిపిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఏప్రిల్ 28న ముంబయిలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఏర్పాటు చేసిన గ్రాండ్ షో చూసి అభిమానులు మీడియా ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యపోయారు. స్ట్రీమింగ్ దిగ్గజం త‌దుప‌రి 41 షోలు సినిమాలను ప్రకటించడానికి ఈ ఈవెంట్ ను నిర్వహించింది. ఒక ప్రత్యేక ప్ర‌మోష‌న్ వేదిక‌గా ఇది సాగింది. అయితే ఈ షోకి సినిమాలో న‌టించిన తార‌ల‌తో పాటు సిబ్బంది ప్ర‌తి ఒక్క‌రూ హాజరయ్యారు. వారి వెంచర్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం వేదికపైకి వచ్చారు.

షాహిద్ కపూర్- విజయ్ సేతుపతి- అజయ్ దేవగన్- రోహిత్ శెట్టి- సిద్ధార్థ్ మల్హోత్రా- సోనాక్షి సిన్హా- విద్యాబాలన్- మాధురీ దీక్షిత్- జుహీ చావ్లా- ఎస్ జె సూర్య- నాగ చైతన్య- ఆర్య- అర్షద్ వార్సీ- తమన్నా భాటియా వంటి పలువురు బాలీవుడ్ తార‌లు సౌత్ ప్రముఖులు పాల్గొన్నారు. ఫర్హాన్ అఖ్త‌ర్- మోహిత్ రైనా- మనోజ్ బాజ్ పేయి- అభిషేక్ బచ్చన్- రాజ్ బబ్బర్ తదితరులు ఈ చిరస్మరణీయమైన ఈవెంట్ కు హాజరయ్యారు.

అయితే ఈ వేదిక‌పై ఎక్క‌డా క‌ర‌ణ్ జోహార్ క‌నిపించ‌లేదు. దానికి కార‌ణ‌మేమిటీ అన్న‌ది ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌ప‌డింది. కంగనా రనౌత్ తో గొడవ పడకుండా ఉండేందుకు కరణ్ జోహార్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ నుండి గంట విరామం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ ఈవెంట్ లో కంగనా రనౌత్ సందడి ముందు ఇంకేదీ నిల‌బ‌డ‌లేదు. నవాజుద్దీన్ సిద్ధిఖీ- అవ్ నీత్ కౌర్ నటించిన కంగ‌న‌ మొదటి ప్రొడక్షన్ టికు వెడ్స్ షేరు నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుందని ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల కంగ‌న‌ కూడా షోలో భాగమైంది. అయితే ఆమె వేదికపైకి త‌ను వస్తుందని తెలియగానే చాలా మందికి మైండ్ బ్లాక్ అయ్యింద‌ట‌. అలాంటి వారిలో క‌ర‌ణ్ కూడా ఉన్నార‌ట‌.

ఈ షోకి హోస్ట్ కరణ్ జోహార్... కానీ కరణ్ కి అది డైజ‌స్ట్ కాలేద‌ట‌. కంగనా తన టీవీ షో 'కాఫీ విత్ కరణ్'లో బంధుప్రీతి సమస్యను లేవనెత్తిన తర్వాత త‌న వైపు క‌ళ్లు తిప్పి చూడ‌ని క‌ర‌ణ్ .. ఈసారి ఏం చేస్తాడు? అన్న చ‌ర్చా సాగింది. కంగ‌న ప‌దే ప‌దే కాలు దువ్వుతోంది. ఇప్ప‌టికీ అలాగే కొనసాగుతోంది. ఫలితంగా ఈవెంట్ ప్రారంభంలో త‌దుప‌రి అన్ని చిత్రాలు వాటి ప్రదర్శనల విజువ‌ల్స్ ని ప్రదర్శించబడినప్పుడు క‌ర‌ణ్ క‌నిపించ‌లేదు.

ఈ విజువ‌ల్స్ లో టికు వెడ్స్ షేరు చిన్న స్నీక్ పీక్ ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ లలోని ప్రతి నిర్మాత తారాగణం వేదికపైకి చేరుకున్నా క‌ర‌ణ్ క‌నిపించ‌లేదు. నిజానికి ఆ స‌మ‌యంలో ప్రేక్షకులు కరణ్ జోహార్ - కంగనా రనౌత్ ఎట్టకేలకు ముఖాముఖిగా వస్తున్నారని ఎదురుచూడడం మొదలుపెట్టినా అలా జ‌ర‌గ‌లేదు.

కంగనా రనౌత్ వేదికపైకి రావడానికి 40 నిమిషాల ముందు కరణ్ వెళ్లిపోయాడు. అభిషేక్ బచ్చన్ 20 నిమిషాల పాటు హోస్టింగ్ బాధ్యతలు స్వీకరించార‌ట‌. ఆ తర్వాత సుముఖి సురేష్ 40 నిమిషాల పాటు హోస్టింగుని నిర్వహించారు. కంగనా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చినప్పుడు సుముకి హోస్టింగ్ చేసింద‌ట‌. అలాగే టికు వెడ్స్ షేరు గురించి .. అమెజాన్ ప్రైమ్ వీడియోతో తన అనుబంధం గురించి మాట్లాడింది.

కంగనా నిష్క్రమించిన 20 నిమిషాల తర్వాత కరణ్ తన హోస్టింగ్ బాధ్యతలను తిరిగి ప్రారంభించాడు. అటుపై షో ముగిసే వరకు అలాగే కొనసాగించాడు. అంటే కంగ‌న వ‌చ్చే క్ర‌మంలో అత‌డు ఎక్క‌డికి వెళ్లాడు? అంటే స్టేజ్ వెన‌క్కి వెళ్లాడ‌ని కొంద‌రు హోట‌ల్ రూమ్ కి వెళ్లాడ‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సెలబ్రిటీలిద్దరూ ఒకరికొకరు ఇబ్బందికరమైన క్షణాలు కలిగి ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇదంతా ప్లాన్ చేసారా? అంటూ గుస‌గుస వినిపించింది. వాస్తవానికి కరణ్ జోహార్ నిరంతరం 2 గంటల కంటే ఎక్కువ సమయం హోస్టింగ్ చేస్తున్నాడని .. అందువల్ల ఒక గంట విరామం అవసరమని ఒకటి ఏదైనా క్రియేట్ చేయొచ్చు. అయినప్పటికీ, కరణ్ జోహార్ లేనప్పుడు కంగనా రనౌత్ ను పిల‌వ‌డం అన్న‌ది యాదృచ్ఛికం కాదు అన్న‌ది అంద‌రికీ తెలుసు.

ఇక ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత కంగనా రనౌత్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక కథనాన్ని ఉంచారు. అందులో ఆమె నెట్ ఫ్లిక్స్ - కరణ్ జోహార్ ను కూడా తిట్టేస్తూ నానా ర‌చ్చ చేసింది. భారతీయ మార్కెట్ అంతా కేవలం ఒక బిచ్ గాసిపీ నైంటీస్ డైరెక్టర్ కాదు…. ఇక్కడ వందలాది మంది ప్రతిభావంతులు ఉన్నారు.. అంటూ క‌ర‌ణ్ ని తీవ్ర ప‌ద‌జాలంతో తిట్టేసింద‌న్న చ‌ర్చా ఇప్పుడు వేడెక్కిస్తోంది.