Begin typing your search above and press return to search.

కేన్స్ 2019: క‌్వీన్ ర‌చ్చ‌.. దీపిక ధ‌మాకా

By:  Tupaki Desk   |   17 May 2019 5:30 AM GMT
కేన్స్ 2019: క‌్వీన్ ర‌చ్చ‌.. దీపిక ధ‌మాకా
X
కేన్స్ 2019 సంబ‌రాల్లో భార‌తీయ అంద‌గ‌త్తెల‌ ర్యాంప్ వాక్ సొగ‌సు గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ వేదిక‌పై ప్ర‌పంచ దేశాల అంద‌గ‌త్తెలు.. టాప్ మోడ‌ల్స్ తో పోటీప‌డుతూ మ‌న భామ‌లు అల్లాడిస్తుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ డ్రెస్సుల్లో అమ్మ‌ణ్ణులు కేక పుట్టిస్తున్నారు. ఇప్ప‌టికే బిగ్ బాస్ ఫేం హీనా ఖాన్ .. పొడుగుకాళ్ల సుంద‌రి దీపిక ప‌దుకొనే.. క్వీన్ కంగ‌న ర‌నౌత్ .. అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా.. కేన్స్ ఉత్స‌వాల్లో చెల‌రేగిన తీరు ప్ర‌ముఖంగా చ‌ర్చకు వ‌చ్చింది.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోతున్నారంతా. హీనా ఖాన్ ఆరంభం అద‌ర‌గొట్టేయ‌గా... అటుపై నువ్వా నేనా అంటూ మిగ‌తా ముగ్గురు ముద్దుగుమ్మ‌లు రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో మ‌తి చెడ‌గొట్టారు. ముఖ్యంగా క్వీన్ కంగ‌న ర‌నౌత్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న తీరుగా స‌రికొత్త బ్లాక్ డిజైన‌ర్ డ్రెస్ లో అద‌ర‌గొట్టింది. ఈ డ్రెస్ లో క్వీన్ కాస్తంత అదుపు త‌ప్పి ఎద అందాల్ని ఆరంగా ఆవిష్క‌రించ‌డంతో కుర్రాళ్లు క‌ళ్లు తిప్పుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. పూర్తిగా వెస్ట్ర‌న్ గాళ్ స్టైల్లో కంగ‌న మెరుపులు మెరిపించింది. బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ సూట్ కి త‌గ్గ‌ట్టే ఆ బార్డ‌ర్ ని సిల్వ‌ర్ లైన‌ప్ తో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఆ వాడి వేడి చూపుతోనే గుండెల్ని కొల్ల‌గొడుతోంది. రెబ‌ల్ క్వీన్ లా... క్యాట్ ఉమెన్ లా కొత్త‌గా క‌నిపిస్తోంది కంగ‌న‌.

క్వీన్ కంగ‌న‌తో పోటీప‌డుతూ ఇదే వేదిక‌గా దీపిక పదుకొనే సాలిడ్ లుక్ తో ర్యాంప్ పై అద‌రగొట్టేసింది. ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే దీపిక పూర్తిగా కొత్త లుక్ లో క‌నిపించేందుకు చాలానే ప్ర‌యోగాలు చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ త‌ల‌క‌ట్టు స‌హా ఎంపిక చేసుకునే డిజైన‌ర్ డ్రెస్ లోనూ హెవీ లుక్ క‌నిపిస్తోంది. రెక్క‌ల గుర్రం ఆకాశంలోంచి ఎగిరొచ్చిన‌ట్టు ఆ వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ డ్రెస్ పై కాంబినేష‌న్ గా కాఫీ క‌ల‌ర్ టాప్ అదిరిపోయింది. కాటుక క‌ళ్ల‌తో గుండెల్ని కోసేస్తోంది. స్ట‌న్నింగ్ .. మైండ్ బ్లోవింగ్ అంటూ ఈ లుక్ కి పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారంతా. గుడి గోపురం శిఖ‌రాన్ని త‌ల‌పిస్తున్న తీరుగా ఆ హెయిర్ లైన్ ని డిజైన్ చేసిన తీరు ఇంప్రెస్సివ్ గా ఉంది. ఇది అంత‌ర్జాతీయ లుక్ అంత‌కుమించి అనిపించేంతగా ఈ లుక్ ని డిజైన్ చేయ‌డం ఇంట్రెస్టింగ్.