Begin typing your search above and press return to search.

ఫైర్ మీదున్న ఏజెంట్ అగ్ని న్యూ లుక్!

By:  Tupaki Desk   |   8 Feb 2021 11:00 AM IST
ఫైర్ మీదున్న ఏజెంట్ అగ్ని న్యూ లుక్!
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన సినిమాల నుండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ ఇస్తూనే ఉంది. తన రాబోయే చిత్రం ‘ధాకడ్’ మూవీలో కంగనా అభిమానులకు కొత్తగా కనిపిస్తుంది. తాజాగా కొత్త పోస్టర్ పోస్ట్ చేసిన కంగనాను చూస్తుంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఏజెంట్ పాత్రలో ఫైర్ లో ఉన్నట్లు తెలుస్తుంది. రెండు చేతులతో తుపాకీని గట్టిగా పట్టుకున్న కంగనా.. ‘ధాకాడ్’ షూటింగ్ సెట్ నుండి ఈ కొత్త ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఫోటోను సూచిస్తూ.. ఏజెంట్ అగ్ని చాలా ధైర్యవంతురాలు అందుకే ఆమెను ధాకడ్ అని పిలుస్తారంటూ చెబుతోంది. ఇటీవల దర్శకుడు రజీ ఘైని అంకితభావానికి కంగనా ప్రశంసల వర్షం కురిపించింది. డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. “రిహార్సల్స్‌కు ఇంత టైం, ఇంపార్టెన్స్ ఇచ్చే దర్శకుడిని ఎప్పుడూ చూడలేదు" అని చెప్పింది.

ఇటీవలే భారీ యాక్షన్ సన్నివేశాల షూట్ ప్రారంభమైంది. షూటింగ్ ప్రిపరేషన్స్ మొత్తం అయిపోయాయి. దాదాపు 25కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక కంగనాతో ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, దివ్యదత్తా కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా యాక్షన్ సన్నివేశాలలో వారిద్దరూ కూడా పాల్గొన్నారట. షూటింగ్ లో బిజీగా ఉన్న కంగనా అభిమానులకు ఎల్లప్పుడూ ఇలా పోస్టర్స్ తో అప్డేట్స్ అందిస్తూనే ఉంది. ప్రస్తుతం అమ్మడు చేతినిండా సినిమాలు కలిగిఉంది. త్వరలో కంగనా తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్ తలైవి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇవేకాకుండా కంగనా.. తేజ్సా, మణికర్ణిక రిటర్న్స్ సినిమాలతో పాటు ఓ పొలిటికల్ డ్రామాలో ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర చేయనుందట. చూడాలి మరి కంగనా ఎలా అలరిస్తుందో!