Begin typing your search above and press return to search.

స్నానం చేయని బ్యూటీ.. స్వచ్ఛ్ భారత్

By:  Tupaki Desk   |   11 Aug 2016 12:05 PM GMT
స్నానం చేయని బ్యూటీ.. స్వచ్ఛ్ భారత్
X
రీసెంట్ గా స్వచ్ఛ్ భారత్ క్యాంపెయిన్ లో భాగంగా.. కనక మహా లక్ష్మి గెటప్ లో కనిపించింది కంగనా రనౌత్. ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అనేది ఆ యాడ్ కాన్సెప్ట్. మరి పరిసరాలు ఇల్లు కంటే ముందు.. ఒళ్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ కంగనా మాత్రం రోజూ స్నానం చేయాలంటే తెగ బద్ధకంగా అనిపించేదట.

సోమరితనంతో బద్ధకంగా జీవితం గడిపేస్తూ.. ఆరోగ్యం గురించి కూడా పట్టించుకునే దాన్ని కాదని అంటోంది కంగనా. ఇలాంటి టైమ్ లో.. వేదాంతం చదివేసిందట ఈ భామ. స్వామి వివేకానంద చెప్పిన బోధనలను.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రారంభించాకే.. పరిశుభ్రత అవసరం తెలిసిందని చెప్పింది కంగనా రనౌత్. ఆధ్యాత్మిక దారిలోకి అడుగుపెట్టాకే తాను మానసికంగా దృఢంగా తయారయ్యానని చెప్పిన ఈ బాలీవుడ్ క్వీన్.. ఆరోగ్యం పైనా, శుభ్రత పైనా శ్రద్ధ పెంచుకున్నానని అంటోంది.

స్వచ్ఛ్ భారత్ కి ప్రచారం చేస్తూ.. తను ఎంత మురిగ్గా ఉండేదో.. అవన్నీ మానేసి శుభ్రత దారిలోకి వచ్చాక ఏ రేంజ్ కి ఎదిగిందో.. ఇంత డీటైల్డ్ గా చెప్పిన కంగనా కంటే.. కరెక్ట్ అంబాసిడర్ ఎవరుంటారు లెండి. అయితే.. ఆధ్యాత్మిక కోసం మినరల్ వాటర్ తో స్నానం చేస్తున్నావా? దేవుడు అలా చెప్పాడా పాపా అంటూ ఆన్ లైన్ లో బోలెడన్ని జోకులు పేలుతున్నాయ్.