Begin typing your search above and press return to search.
పోకిరిలో అసలు హీరోయిన్ నేనే.. స్టార్ హీరోయిన్ వ్యాఖ్య
By: Tupaki Desk | 28 April 2020 10:57 PM ISTతన మనసుకు ఏదనిపిస్తే అది ముఖం మీదే చెప్పేయడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీరు. అందరూ అది పొగరు అంటే కంగనా మాత్రం అది కేవలం ముక్కుసూటితనమే అంటుంది. ఆమె తీరు కొందరికి నచ్చుతుంది కానీ ఆ ముక్కుసూటితనమే కొన్నిసార్లు వివాదాలలోకి నెట్టేస్తుంది. అలాగని తీరు మార్చుకునే రకం కాదు కంగనా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో మిస్ అయిన విషయాలు బయట పెట్టింది. మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో పోకిరి ఒకటి. 2006వ సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇలియానా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
పోకిరి తరువాత ఇలియానా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగారు. అయితే ఈ సినిమాలో మొదట నటించే అవకాశం కంగనా రనౌత్ కు వచ్చిందట. ఈ విషయాన్ని కంగనానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలోచెప్పింది. ఐ లవ్యూ బాస్ అనే సినిమా సమయంలో కంగనా మొదటిసారిగా ఆడిషన్స్ కు వెళ్లి చాలా ఇబ్బందులు పడిందట. ఆడిషన్స్ ఎలాగో కష్టపడి కంప్లీట్ చేసినా, నచ్చక తన ఫోన్ నంబర్ మార్చేసి వారికి కనిపించకుండా ఎస్కేప్ అయిందట. ఆ తరువాత గ్యాంగ్ స్టర్ సినిమా ఆడిషన్స్ కు వెళ్లి.. అదే సమయంలో పూరి జగన్నాథ్, మహేష్ బాబు పోకిరి ఆడిషన్స్ జరుగుతుంటే వాటికి కూడా హాజరైందట.
ఒకేసారి గ్యాంగ్ స్టర్, పోకిరి రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. గ్యాంగ్ స్టర్ కు డేట్లు ఇచ్చేయడంతో పోకిరి మిస్ చేసుకున్నట్టు కంగనా తెలిపింది. ఒకవేళ పోకిరిలో నటించి ఉంటే టాలీవుడ్ లో కంగనా ఓ మంచి స్థాయిలో ఉండేదాన్ని అని చెప్పింది కంగనా.. నిజమే కదా! ఎందుకంటే పోకిరి ఒక సంచలనం. ఈ సందర్భంగా దక్షిణాదిన తనకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని తెలియజేసింది. వీలైతే మహేష్ బాబుతో తప్పకుండా సినిమా చేస్తానని కంగనా తెలిపారు. ‘దక్షిణాదిన చాలా హీరోలంటే నాకు ఇష్టం. కానీ మహేష్ బాబుతో కలిసి పని చేయాలని ఉంది’ అని తన మనసులో కోరికను బయటపెట్టింది.