Begin typing your search above and press return to search.

ఇందిరా గాంధీ పాత్రలో కంగనా..!

By:  Tupaki Desk   |   29 Jan 2021 4:14 PM GMT
ఇందిరా గాంధీ పాత్రలో కంగనా..!
X
లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో సత్తా చాటుతున్న బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌.. ఇప్పుడు దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ (ఐరన్‌ లేడీ)గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించడానికి రెడీ అయింది. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం బయోపిక్‌ కాదని.. ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ మూవీలో పలు దిగ్గజ నటులు నటిస్తారని కంగనా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని, స్క్రిప్ట్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దేశంలో నెలకొన్న రాజకీయాలపై ఈ తరానికి ఈ పొలిటికల్‌ మూవీ ఓ అవగాహన కల్పిస్తుందని అన్నారు.

తన స్నేహితుడు సాయి కబీర్‌ తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కంగనా పేర్కొంది. మణికర్ణిక తీసిన బృందమే ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపింది.ఈ క్రమంలోనే కంగనాపై చేసిన ఫొటోషూట్‌ వివరాలను కూడా వెల్లడించింది. ఇది నా కెరీర్ ప్రారంభంలో నేను చేసిన ఐకానిక్ ఉమెన్ ఫోటోషూట్.. తెరపై ఐకానిక్ లీడర్‌ గా నటించబోతున్నానని నాకు తెలుసు అని కంగనా తెలిపింది. ఈ ఫోటోలలో కంగనా ఇందిరాగాంధీ లుక్‌ లో మెరిసింది. ఇందిరా గాంధీ మాదిరిగా హెయిర్‌ స్టైల్‌, వస్త్రధారణలో కనిపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే పడని కంగనా రనౌత్.. ఇందిరాగాంధీ పాత్రలో నటించడం గమనార్హం.