Begin typing your search above and press return to search.

అజ‌య్ దేవ‌గ‌ణ్ పై కంగ‌న ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   16 Sep 2022 10:55 AM GMT
అజ‌య్ దేవ‌గ‌ణ్ పై కంగ‌న ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు!
X
బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ముక్కుసూటి వ్య‌వ‌హారం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. విష‌యం ఏదైనా దాప‌రికాలు లేకుండా మాట్లాడుతుంది. అది పాజిటివ్ అయినా..నెగిటివ్ అయినా. అతిగా కోపం వ‌స్తే ఎలా విరుచుకుప‌డుతుందా? త‌న‌కు న‌చ్చ‌ని వారిపై అభిమానాన్ని సైతం అలాగే కురిపిస్తుంది. అదే కంగ‌న స్పెషాల్టీ. తాజాగా అమ్మ‌డు బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ ని ఉద్దేశించి ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది.

ఈరోజు అజయ్ దేవగన్ అహ్మదాబాద్‌లో తన మల్టీప్లెక్స్ థియేటర్‌ను ప్రారంభించారు. అలాగే ఇతర నగరాల్లో కూడా థియేటర్‌లను ప్రారంభించే తన భవిష్యత్తు ప్రణాళిల గురించి చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అజ‌య్ ని ఓ రేంజ్ లో ప్ర‌శంసించింది. ''ఒక సూపర్‌స్టార్ తన వనరులను మరియు ప్రభావాన్ని ఉపయోగించుకోవడానికి ఇదే స‌మ‌యాన్ని అత్యుత్తమ మార్గంగా భావించ‌డం విశేషం.

ఇలా థియేట‌ర్ల ప్రారంభించ‌డం ద్వారా ఎంతో మ‌మందికి ఉపాధి దొరుకుతుంది. ఉద్యోగ అవ‌కాశాల్ని క‌ల్పించ‌డం గొప్ప విష‌యం. భారతదేశం మరియు చైనాలోని స్క్రీన్‌ల గురించిన డేటాను సైతం'' ఉదహరించింది.

అలాగే అజయ్ దేవగణ్‌ తన సినిమాలను అస్సలు ప్రమోట్ చేయర‌ని న‌టి చెప్పడంతో చాలా మంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆ వ్యాఖ్య‌ల్ని స‌వ‌రించుకుని అజయ్ దేవగణ్‌ తన సినిమాలే కాకుండా అన్ని చిత్రాలను ప్రమోట్ చేస్తార‌ని వ్యాఖ్యానించింది.

ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. కంగ‌న పాజిటివ్ వ్యాఖ్య‌ల‌పై అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అమ్మ‌డు సంద‌ర్భాన్ని బ‌ట్టి స్పందిస్తుంద‌ని..మంచైనా..చెడు అయినా ఆమె ఎప్పుడు స్పెష‌ల్ అంటూ పొగిడేస్తున్నారు. ప్ర‌స్తుతం కంగ‌న 'ఎమెర్జెన్సీ' చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కంగ‌న దివంగ‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తున్నారు.

అలాగే నిర్మాత‌గానూ కంగ‌న వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. ఇప్ప‌టికే 'టికు వెడ్స్ షేర్' చిత్రం షూటింగ్ పూర్తిచేసింది. కొత్త సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది. అటు అజ‌య్ దేవ‌గ‌ణ్ సైతం హీరో..నిర్మాత‌గా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసొందే. ఇటీవ‌లే 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో కీల‌క పాత్ర‌లో మెప్పించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.