Begin typing your search above and press return to search.

అమ్మాయిపై కంగ‌నా బాడీగార్డ్ లైంగిక దాడి.. ఏం చేశాడో తెలుసా?

By:  Tupaki Desk   |   22 May 2021 1:00 PM IST
అమ్మాయిపై కంగ‌నా బాడీగార్డ్ లైంగిక దాడి.. ఏం చేశాడో తెలుసా?
X
కంగ‌నా ర‌నౌత్ ప‌ర్స‌న‌ల్ బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై రేప్ కేసు న‌మోదైన‌ట్టు స‌మాచారం. త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేశాడంటూ.. ముంబైకి చెందిన ఓ మేక‌ప్ ఆర్టిస్టు కేసు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. త‌మ‌కు ఎనిమిదేళ్లుగా ప‌రిచ‌యం ఉంద‌ని, గ‌తేడాది జూన్లో పెళ్లి కూడా చేసుకుంటాన‌ని చెప్పాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే ప‌లుమార్లు త‌న నివాసానికి వ‌చ్చి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా త‌న‌నుంచి రూ.50వేలు కూడా తీసుకున్నాడ‌ని పేర్కొన్న‌ట్టు స‌మాచారం. క‌ర్నాట‌క‌కు చెంఇన కుమార్ హెగ్డే.. ఏప్రిల్ 27న త‌న సొంత ప్రాంతానికి వెళ్తున్న స‌మ‌యంలో త‌న‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇచ్చాడ‌ని తెలిపింద‌ట‌.

ఆ త‌ర్వాత నుంచి త‌న‌తో మాట్లాడ‌టం లేద‌ని పేర్కొన్న‌ట్టు స‌మాచారం. తాను ఫోన్ చేస్తే.. అత‌నికి వేరే పెళ్లి చేస్తున్న‌ట్టు కుమార్ త‌ల్లి చెప్పింద‌ని, పెళ్లికూడా నిశ్చ‌యించామ‌ని చెప్పింద‌ని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు స‌మాచారం. కంప్లైంట్ రిజిస్ట‌ర్ చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. కాగా.. ఈ కేసుపై కంగ‌నార‌నౌత్ ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు.