Begin typing your search above and press return to search.

బ‌రువు పెర‌గ‌డం కోల్పోవ‌డంలో త‌లైవి తిప్ప‌లివీ!

By:  Tupaki Desk   |   28 Sep 2021 3:30 AM GMT
బ‌రువు పెర‌గ‌డం కోల్పోవ‌డంలో త‌లైవి తిప్ప‌లివీ!
X
బ‌యోపిక్ లో న‌టించ‌డం అంటేనే స‌వాల్. వేరొక వ్య‌క్తిగా రూపాంత‌రం చెంద‌డం అంటే అది కష్టతరమైన పార్ట్. తుది ఫలితం మనం వాటిని తెరపై చూసినప్పుడు పూర్తిగా విస్మయానికి గురిచేయాలంటే చాలా శ్ర‌మించాలి. ఆఫ్-ద స్క్రీన్‌ లో పరివర్తన చెంద‌డానికి న‌టీమ‌ణులు ఎంత‌గా త‌పిస్తారో ప్రేక్ష‌కునికి ఐడియా ఉండ‌దు. అమీర్ ఖాన్ దంగల్ లో శారీర‌క ప‌రివ‌ర్త‌న‌.. దమ్ లగా కే హైషాలో భూమి పెడ్నేకర్ ప‌రివ‌ర్త‌న ప్ర‌తిదీ ఆశ్చ‌ర్య‌పరిచాయి. తాజాగా తలైవి చిత్రంలో కంగనా రనౌత్ పాత్ర అంతే సంక్లిష్ట‌మైన‌ది. ఈ మూవీ కోసం త‌న రూపాన్ని ఎలా మార్చుకుందో చూశాం.

ప్రముఖ రాజకీయ నాయకురాలు ..మాజీ సీఎం జె. జయలలిత పాత్ర‌ధారిగా కంగ‌న‌ గత కొంత కాలంగా ట్రెండ్ అవుతున్నారు. దీనికోసం కంగనా తీవ్రమైన శరీర పరివర్తన చేయించుకోవలసి వచ్చింది. నాయ‌కురాలిగా న‌ట‌నా విభాగాన్ని మెప్పించేందుకు దాదాపు 20 కిలోల బరువు పెరిగింది. కంగనా తెరపై J జయలలిత ప్రతి సజీవ సంస్కరణను ఆవిష్క‌రించింది. అయితే దాని కోసం పరివర్తన చాలా శ్రమతో కూడుకున్నది. ఇటీవల కంగ‌న‌ సోషల్ మీడియాలో ప్ర‌స్థావిస్తూ.. శరీరంలో చాలా సాగిన గుర్తులను ఫోటోల రూపంలో ఓపెన‌య్యింది.

కంగనా ఏజ్ 34. కానీ 60 ప్ల‌స్ నాయ‌కురాలి పాత్ర కోసం మారిన తీరు ఇప్పటికే ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం కోసం బరువు పెరగడం గురించి నటి చాలా ఓపెన్ గా నిజాయితీగా మాట్లాడారు. పాత్ర కోసం ప‌రివ‌ర్త‌న‌లో భాగంగా శాశ్వతంగా సాగిన గుర్తుల(స్ట్రెచ్ మార్కులు)తో క‌నిపిస్తోంది. చర్మం సాధారణం కంటే చాలా ఎక్కువ విస్తరించినప్పుడు ఏర్పడే రంగు మార్కులు క‌నిపిస్తున్నాయి. బరువు పెరగడం తగ్గడం రెండింటిలోనూ స్ట్రెచ్ మార్కులు సంభవిస్తాయి.

`తలైవి`లో ప్రభావవంతమైన పాత్ర గురించి ఆమె శరీరంపై పడిన టోల్ గురించి వివరించి కంగనా సినిమా నుండి ముందు తరువాత కొన్ని ఫోటోలను పంచుకుంది. 20 కేజీలు పెరగడం 6 నెలల్లోనే దాన్ని కోల్పోవడం కూడా నా ముప్పై ఏళ్లలో నా శరీరంలో చాలా విషయాలను గందరగోళానికి గురిచేసింది ...అని కంగన‌ తెలిపింది. ప్రత్యేకించి తన 30 ఏళ్ళలో చేయించుకోవడం అంత సులువైన సవాలు కాదని ఒప్పుకున్నారు. భారీ బరువు పెరగడం కోల్పోవడం కూడా ఆమె వీపుపై చాలా ఒత్తిడిని కలిగించిందిట‌. ఆమె సాధారణ స్టామినా చురుకుదనాన్ని తిరిగి పొందడం కఠినంగా మారింద‌ని తెలిపారు.

కంగనా చాలా మంచి జీవనశైలి ఆస‌క్తిక‌రం. పరిశుభ్రమైన ఆకుపచ్చ ఆహారపు అలవాట్లను కలిగి ఉంది. క్రమం తప్పకుండా పనిచేస్తుంది. భారీ బరువు పెరుగుట ప్ర‌తిదీ ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే జ‌రిగింది. 30 ఏళ్లలో బరువు తగ్గడం ఒక వయస్సు తర్వాత.. ముఖ్యంగా మహిళలకు, చూపించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే శరీరం చాలా శారీరక మార్పులకు లోనవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మనం కండర ద్రవ్యరాశిని కోల్పోవడం ప్రారంభిస్తాము. నెమ్మదిగా జీవక్రియ పేలవమైన ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి స్థాయిలను పెంచుతాయి. సుదీర్ఘ పని షెడ్యూల్‌లు కూడా ఒక వ్యక్తి తన 20 ఏళ్లలోపు వారితో పోల్చితే పురోగతి సాధించడం కష్టతరం చేస్తుంది. తలైవిలోని పాత్ర విషయానికొస్తే, ..కంగనా తన ఇతర సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నందున ధాకాడ్ - తేజస్ తో సహా,పరివర్తన తక్కువ వ్యవధిలో జరగవలసి ఉంది. ఆరు నెలల వ్యవధిలో ఫిట్ నెస్ సాధించింద‌ట‌. ఆమెతో సన్నిహితంగా పనిచేసిన డైట్ నిపుణుల సహాయంతో కంగనా 20 కిలోలు పెరిగి తిరిగి దానిని కూడా కోల్పోయింది. బరువు తగ్గడానికి కంగనా హార్మోన్ల మాత్రలు .. ప్రముఖ ఆహారాలను కూడా తీసుకోవాల్సి వచ్చింది. అది ఆమె బరువు వేగంగా పెరగడానికి సహాయపడింది. అంతే కాకుండా కంగనా తన సినిమా దర్శకుడు AL విజయ్ బరువు పెరగడంలో సహాయపడ్డార‌ట‌. ఎందుకంటే పరివర్తన అత్యంత సహజమైన రీతిలో జరిగేలా చేయడానికి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకువచ్చాడు.