Begin typing your search above and press return to search.

దంచుకో వరుణ్ తేజా దంచుకో

By:  Tupaki Desk   |   20 Oct 2015 11:26 AM IST
దంచుకో వరుణ్ తేజా దంచుకో
X
అందుకే అనుకోవాలి.. ఏం జరిగినా మన మంచికే అని. ముందు అనుకున్నట్లు అక్టోబరు 2న ‘కంచె’ సినిమా విడుదలై ఉంటే.. పులి - శివమ్ లాంటి మరో రెండు పెద్ద సినిమాలతో పోటీ పడాల్సి వచ్చేది. ఆ సినిమాలు బాలేకున్నా సరే.. ఓపెనింగ్స్ విషయంలో ‘కంచె’కు కచ్చితంగా పంచ్ పడేది. పైగా తర్వాతి రెండు వారాల్లో రుద్రమదేవి - బ్రూస్ లీ లాంటి భారీ సినిమాలు వచ్చాయి కాబట్టి.. ఆ హైప్ ముందు ‘కంచె’ బాగున్నా సరే మరుగున పడిపోయేది. కానీ ఇప్పుడు చూడండి. ‘రుద్రమదేవి’ జోరు తగ్గిపోయింది. ‘బ్రూస్ లీ’ అసలు జోరే చూపించడం లేదు. దసరాకు పోటీగా వస్తున్న రెండూ కూడా చిన్న సినిమాలే. దీంతో బాక్సాఫీస్ కింగ్ అయ్యే అవకాశాలు ‘కంచె’కు మెండుగా కనిపిస్తున్నాయి. అక్టోబరు 2న కంటే 22న చాలా హైప్ మధ్య విడుదలవుతోంది ‘కంచె’ సినిమా.

ఒక సినిమా వయసు వరుణ్ తేజ్ ది. ఇంకా మాస్ ఇమేజ్ రాలేదు, పెద్ద మార్కెట్ కూడా క్రియేటవలేదు. క్రిష్ కూడా కమర్షియల్ డైరెక్టరేమీ కాదు కాబట్టి.. అతడికీ పెద్ద మార్కెట్ లేదు. అయినప్పటికీ ‘కంచె’ మీద స్థాయికి మించి బడ్జెట్ పెట్టాడు క్రిష్. అక్టోబరు 2నే విడుదలై ఉంటే.. బడ్జెట్ రికవరీ కాస్త కష్టమయ్యేదే. కానీ దసరా సెలవుల్లో వస్తుండటం వల్ల.. మిగతా సినిమాలన్నిటికంటే దీని మీదే భారీ అంచనాలుండటం వల్ల కలెక్షన్ల పండగ చేసుకునే అవకాశముంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఊహించని స్థాయిలో వసూళ్లు వచ్చే అవకాశముంది. పైగా గురువారమే విడుదలవుతోంది కాబట్టి.. లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చే అంశమే. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.