Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌: కంచె వేసి.. గన్‌తో కాపలా

By:  Tupaki Desk   |   7 July 2015 8:08 AM GMT
ఫస్ట్‌ లుక్‌: కంచె వేసి.. గన్‌తో కాపలా
X
ఇంతవరకు ఆ సినిమాలో మనోడు చేసే క్యారెక్టర్‌ ఏంటో తెలియదు. ఒకసారి జెమీందార్‌ ప్యాలెస్‌ సెట్‌ వేశారు మరోసారి మరో సెట్‌ వేశారు. ఆ తరువాత జార్జియా దేశంలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్‌ చేశారు. చూస్తుంటే ఇదేదో వరల్డ్‌ వార్‌ నేపథ్యంలో తీయబడుతున్న తెలుగు లవ్‌ స్టోరీ అన్నట్లుంది. ఇంతకీ మనం మాట్లాడేది ఎవరి గురించి అనేగా... ఇంకెవరు ''కంచె'' సినిమాతో దూసుకొస్తున్న వరుణ్‌ తేజ్‌ గురించే.

క్రియేటివ్‌ డైరక్టర్‌ క్రిష్‌ డైరక్షన్‌లో వస్తున్న ''కంచె'' సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యిందట. ఇప్పటివరకు ఎంతో సీక్రెట్‌గా సాగిన ఈ సినిమాను త్వరలోనే రిలీజ్‌ చేస్తున్నారు కూడా. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక స్టిల్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేశాడు వరుణ్‌. చూస్తుంటే మనోడు ఎక్కడో ఓ సముద్ర తీరంలో సైనికులు కంచె వేస్తే.. ఆ ప్రక్కనే మనోడు మెషిన్‌ గన్‌ చేతిలో పెట్టుకొని కాపలా కాస్తున్నట్లు ఉంది. అంటే మనోడు ఒక బ్రిటీష్‌-ఇండియా సైనిక శిబిరంలో సిపాయి అని అర్ధమైపోతోందిగా.. చూస్తుంటే ఏదో వార్‌ డ్రామాను తీస్తున్నట్లున్నాడు క్రిష్‌. వినడానికి చాలా కొత్తగా ఉంది మరి. చూడ్డానికి కూడా అలానే ఉంటే ఇక సినిమా హిట్టే.