Begin typing your search above and press return to search.

మరి కంచె ను ఎందుకు వాయిదా వేశారు?

By:  Tupaki Desk   |   30 Sep 2015 11:14 AM GMT
మరి కంచె ను ఎందుకు వాయిదా వేశారు?
X
ఈపాటికి ‘కంచె’ కోసం కౌంట్ డౌన్ నడుస్తుండాల్సింది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే ఇంకో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కారణాలేంటో తెలియదు.. సినిమా నెల రోజులకు పైగా వాయిదా పడిపోయింది. వాయిదాకు కారణం చెబుతానన్న హీరో పత్తా లేడు. ఇంతలోనే సడెన్ గా ‘కంచె’ సెన్సార్ అయిపోయిందన్న కబురు వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేశారు సెన్సార్ బోర్డు అధికారులు. సినిమా చాలా బాగుందని.. అద్భుతమైన క్వాలిటీతో తీశారని యూనిట్ సభ్యుల్ని అభినందించారట సెన్సార్ అధికారులు.

ఐతే సెన్సార్ అయిపోయిందంటే సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్నట్లు అర్థం. రిలీజ్ వెర్షనే సెన్సార్ బోర్డుకు సమర్పిస్తారు మూవీ మేకర్స్. మరి సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్నపుడు నెల రోజులకు పైగా వాయిదా ఎందుకు వేసినట్లో అర్థం కావడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఏమైనా ఇబ్బందులున్నా.. రీషూట్లు - రిపేర్లు ఏమైనా ఉన్నా.. ఇప్పుడే సెన్సార్ చేసేవాళ్లు కాదు. అక్టోబరు ఆఖర్లో రిలీజ్ కు వారం ముందు ఈ కార్యం కానిచ్చేవారు. మరి నవంబరు 6న రిలీజ్ అంటే ఇప్పుడే సెన్సార్ చేయించేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతా పక్కా అనున్నపుడు యధావిధిగా అక్టోబరు 2న విడుదల చేసేస్తే ఓ పనైపోయేది కదా.