Begin typing your search above and press return to search.

కంచె.. రాజుగారి గ‌ది.. అలా క‌లిసొచ్చింది

By:  Tupaki Desk   |   1 Nov 2015 5:18 AM GMT
కంచె.. రాజుగారి గ‌ది.. అలా క‌లిసొచ్చింది
X
ఏదైనా సినిమాకి మంచి రిలీజ్ తేదీ చాలా ముఖ్యం అని కింగ్ నాగార్జున చెబుతుంటారు. స‌రైన రిలీజ్ స‌రైన విజ‌యం ఇస్తుంద‌ని అంటుంటారాయ‌న‌. అయితే కింగ్ త‌ల‌చిన ప్ర‌చారం అఖిల్ ద‌స‌రా బ‌రిలో రాక‌పోయినా సేమ్ టైమ్ రిలీజ్‌ కి వ‌చ్చిన వ‌రుణ్‌ తేజ్ కంచె - ఓంకార్ రాజుగారి గ‌ది బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించాయి.

వీటి కంటే వారం ముందే వ‌చ్చిన బ్రూస్‌ లీ ఫ్లాప‌వ్వ‌డం ఈ రెండు సినిమాల‌కు బాగా క‌లిసొచ్చింది. మూడు వారాల పాటు నిరాటంకంగా ఈ సినిమాలు పోటీ అనేదే లేకుండా రేసులో దూసుకుపోతున్నాయి. ఈ శుక్ర‌వారం రిలీజైన క‌ళ్యాణ్‌ రామ్ షేర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో మ‌రో వారం ఈ సినిమాల‌కు ముకుతాడు వేసే నాధుడే లేకుండా పోయాడు. ఏ కోణంలో చూసినా మునుముందు బెంగాళ్ టైగ‌ర్‌ - త్రిపుర సినిమాలు వ‌చ్చే వ‌ర‌కూ ఈ సినిమాల‌కు వ‌సూళ్ల ప‌రంగా ఢోకా నే లేదు.

న‌వంబ‌ర్ 1న లేదా 5న బెంగాళ్ టైగ‌ర్ వ‌స్తుంద‌ని అనుకున్నా అది న‌వంబ‌ర్ 11 వ‌ర‌కూ వాయిదా ప‌డేట్టే క‌నిపిస్తోంది. అదే రోజు అఖిల్ సినిమా కూడా రిలీజ‌వుతుంది. అంత‌వ‌ర‌కూ కంచె - రాజుగారి గ‌ది సినిమాల‌కు తిరుగేలేద‌ని చెబుతున్నారు. మంచి రిలీజ్ ఈ రెండు సినిమాల‌కు క‌లిసొచ్చింది. అదే ముందుకు న‌డిపిస్తోంద‌న్న‌మాట‌!