Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి మూడో హీరోయిన్ ఎవరంటే

By:  Tupaki Desk   |   11 Aug 2016 9:09 AM GMT
మెగా మేనల్లుడి మూడో హీరోయిన్ ఎవరంటే
X
తిక్క తిక్క తిక్కగున్నదే. అంటూ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పాటలు పాడటం ఏమో తెలియదు కాని.. ఈ సినిమాలోని హీరోయిన్లను చూస్తే నిజంగానే తిక్క తిక్కగానే ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎవరు హీరోయిన్ అనే విషయం తెలియదు. పైగా ఇప్పటివరకు కనిపిస్తున్న బ్రెజిలియన్ బ్యూటి లరిస్సా బొనేసి.. మరియు మన్నారా చోప్రా మాత్రమే హీరోయిన్లు కాదండోయ్. మరో థార్డ్ హీరోయిన్ కూడా ఉంది.

ఆమె పేరు కామ్నా సింగ్. తమిళం మరియు కన్నడలో చాలా సినిమాలే చేసింది. ఈ డస్కీ బ్యూటిని ఒక సినిమా సాంగులో చూసిన ప్రొడ్యూసర్ రోహిణ్‌ రెడ్డి ఈమెను సెలక్ట చేశారంట. అయితే 'తిక్క' సినిమాలో ఇప్పటివరకు తమిళంలో చేసినట్లు కేవలం అందాల ఆరబోతకు మాత్రం పరిమితం కాలేదని.. ఇక్కడ చాలా పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రను పోషించానని చెబుతోందీ సుందరి. ఇక తెలుగులో రామ్‌ చరణ్‌ డ్యాన్సు వీడియోలు చూసి బాగా ఇంప్రెస్ అయ్యిందట. అతగాడు తన సినిమాలో ఏదైనా ఛాన్సు ఇస్తే సత్తా చాటుకోవాలని చూస్తోందట కామ్నా.

బాగానే ఉంది. అసలు 'తిక్క' సినిమా ట్రైలర్ చూస్తే ఏ హీరోయిన్ ఎవరో కూడా గుర్తుపట్టడం చాలా కష్టమే. మరి సినిమా రిలీజయ్యే వరకు వెయిట్ చేద్దాం అప్పుడు కాని మనకు ఎవరు ఏ రోల్ చేశారు.. ఎలా చేశారు.. అనే విషయంపై క్లారిటీ రాదు. సునీల్ రెడ్డి డైరక్షన్లో రూపొందిన సాయిధరమ్ తేజ్ తిక్క.. ఎల్లుండే (ఆగస్టు 13న) రిలీజవుతోంది.