Begin typing your search above and press return to search.

కమలాహ్యారిస్ పై మల్లిక జోస్యం నిజమైందే!

By:  Tupaki Desk   |   10 Nov 2020 2:30 AM GMT
కమలాహ్యారిస్ పై మల్లిక జోస్యం నిజమైందే!
X
బాలీవుడ్ హాట్ బాంబ్.. హీరోయిన్ మల్లికా శెరావత్ 11 ఏళ్ల క్రితం ఏ మూడ్ లో ఉండి అన్నదో కానీ ఇప్పుడు ఆ మాట నిజమైంది. అప్పటి ప్రవాస భారతీయురాలు కమలా హ్యారిస్ అమెరికాలో ఉన్నతస్థాయికి ఎదుగుతారని 11 ఏళ్ల క్రితం బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శెరావత్ జోస్యం చెప్పింది. ఆ జోస్యం నిజంగానే నిజమై ఇప్పుడు కమలా అమెరికా ఉపాధ్యక్షురాలైంది.

దీంతో మల్లికా మళ్లీ ఆ పాత ట్వీట్ ను తెరమీదకు వచ్చి తన పాత డైలాగులను వల్లెవేసింది. ‘నేను ఆరోజు చెప్పిందే నిజమైందని.. నా టంగ్ గోల్డెన్ టంగ్’ అంటూ తనను తానే వెనకేసుకొచ్చింది. అంతేకాదు.. కమలా హ్యారిస్ తో మల్లికా శెరావత్ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి.

2009లో బాలీవుడ్ ను మల్లికా ఓ ఊపు ఊపింది. టాప్ హీరోయిన్ గా కుర్రకారు కు చమటలు పట్టించింది. అంగాంగ ప్రదర్శనతో హాట్ బ్యూటీగా నిలిచింది. 2009 జూన్ 23న అమెరికాలో కమలాతో బాలీవుడ్ నటి మల్లికా కలిసి ఫొటోలు తీయించుకుంది. కమలా అప్పుడు శాన్ ఫ్రాన్సిస్ కో డిస్ట్రిక్ అటార్నీగా పనిచేస్తున్నారు. అప్పుడే ఖచ్చితంగా కమలా ఉన్నతస్థాయికి ఎదుగుతారని .. ఎవ్వరూ ఊహించని పదవి చేపడుతారని మల్లికా చెప్పారు. ఆరోజు చెప్పిన జోస్యం నిజం కావడంతో మల్లిక దాన్ని మరోసారి గుర్తు చేసుకొని తనకు తానే పొగడ్తలు కురిపించుకుంది.

బాలీవుడ్ సినిమాలు చేసిన మల్లికా ఆ తర్వాత చైనీస్, హాలీవుడ్ సినిమాల్లో నటించింది. విదేశాల్లో తెగ చక్కర్లు కొట్టి చాలా సినిమాల్లో నటించింది. జాకీచాన్ తోపాటు హాలీవుడ్ ప్రముఖ హీరోలతో నటించింది. అయితే ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో సైలెంట్ గా ఉంది.