Begin typing your search above and press return to search.

మళ్లీ యాక్షన్ షురూ చేసిన కమల్!

By:  Tupaki Desk   |   23 Dec 2021 5:53 AM GMT
మళ్లీ యాక్షన్ షురూ చేసిన కమల్!
X
కమల్ హాసన్ కథానాయకుడిగా 'విక్రమ్' సినిమా రూపొందుతోంది. కమల్ సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చివరి షెడ్యూల్ కి చేరుకుంటూ ఉండగా, కమల్ కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన కొంతకాలం పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ షూటింగుకి దూరంగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు. అందువలన మళ్లీ ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు.

తాజాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగును స్టార్ట్ అయింది. షూటింగు స్పాట్ లో లోకేశ్ కనగరాజ్ తో కలిసి కమల్ ఏదో సీన్ విషయంగా డిస్కస్ చేస్తున్న స్టిల్ ఒకటి వదిలారు. కమల్ కాంబినేషన్ లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ప్రధాన పాత్రధారులంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళుతున్నారు. ఇంతకుముందు కమల్ చాలా యాక్షన్ మూవీస్ లో చేశారు. ఇక డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడమనేది ఆయనకేం కొత్త కాదు. కానీ ఈ సినిమా వాటికి పూర్తిగా భిన్నమనేది ఆయన చెబుతున్న మాట.

ఇంతకుముందు లోకేశ్ కనగరాజ్ నుంచి 'మానగరం' .. 'ఖైదీ' .. 'మాస్టర్' సినిమాలు వచ్చాయి. మొదటి రెండు సినిమాలు కూడా లోకేశ్ కి స్క్రీన్ ప్లే పై ఎంత పట్టు ఉందనేది చెబుతాయి. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. ఈ రెండు సినిమాలు చూసిన తరువాతనే విజయ్ ఆయనకి 'మాస్టర్' సినిమాను ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు చూసిన తరువాతనే కమల్ 'విక్రమ్'ను ఆయన చేతిలో పెట్టారు. కమల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే లోకేశ్ కనగరాజ్ ఉన్నాడు. ముందుగా అనుకున్నట్టుగానే షెడ్యూల్స్ ను పూర్తి చేస్తూ, ఆల్రెడీ కమల్ మనసు గెలుచుకున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి లోకేశ్ కనగరాజ్ వదిలిన కాన్సెప్ట్ వీడియో అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. కొంతమందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించిన కమల్, వాళ్లు వచ్చేలోగా అన్నీ సిద్ధం చేస్తాడు .. ఆయుధాలతో సహా. విందు జరుగుతూ ఉండగానే వాళ్లపై కాల్పులు జరిపేసి హతమారుస్తాడు. ఈ వీడియో .. కమల్ లుక్ అందరిలో ఉత్కంఠను పెంచాయి. ఇక విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వాళ్లంతా కూడా ఈ సినిమాను వేరే లెవెల్ కి తీసుకుని వెళతారనడంలో ఆశ్చర్యం లేదు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుందన్న మాట.