Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ ప్రైవేట్‌ ఫోటోలు హీరో వద్ద ఉన్నాయట!

By:  Tupaki Desk   |   27 Aug 2022 1:30 AM GMT
ఆ హీరోయిన్‌ ప్రైవేట్‌ ఫోటోలు హీరో వద్ద ఉన్నాయట!
X
బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హృతిక్‌ రోషన్ మరియు స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య ఒకానొక సమయంలో తీవ్ర స్థాయిలో గడవ నడిచిన విషయం తెల్సిందే. ఆ సమయంలో హృతిక్‌ పై కంగనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు డైరెక్ట్ ఎటాక్ చేసింది. హృతిక్ రోషన్ కూడా ఆ సమయంలో కంగనా తీరును తప్పుబడుతూ మీడియా ముందు తన అసహనం ను వ్యక్తం చేశాడు.

ఆ విషయాలు జరిగి చాలా కాలం అయ్యింది. జనాలు అంతా మర్చిపోయారు. వారిద్దరు కూడా సాధారణ జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో బాలీవుడ్‌ విమర్శకుడు కమల్‌ ఆర్‌ ఖాన్ ఆ విషయాన్ని మళ్లీ లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నాడు. కంగనా కు హృతిక్ రోషన్ పై మళ్లీ కోపం వచ్చేలా.. ఆమె ఈ విషయంలో స్పందించి మళ్లీ రచ్చ జరిగేలా కమల్‌ ఆర్‌ ఖాన్‌ చిచ్చు రాజేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా హృతిక్‌ రోషన్ నటించిన విక్రమ్ వేద టీజర్ విడుదల అయ్యింది. ఆ టీజర్ యొక్క రివ్యూ ను యూట్యూబ్ ద్వారా కమల్‌ ఆర్ ఖాన్ ఇచ్చాడు.

ఆ రివ్యూ లో హృతిక్‌ రోషన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. హృతిక్‌ రోషన్ ఎందుకు ఎప్పుడూ అబద్దాలు చెబుతున్నాడో అర్థం కాదు. ఆయన ఇప్పటికి అయినా నిజాలు చెప్పాలి. కంగనా రనౌత్ తో ఆయన వ్యవహారం నాకు చెప్పినట్లుగానే అందరికి చెప్పాలి.

ఒకసారి హృతిక్‌ రోషన్ తన ల్యాప్ టాప్ లో కంగనా రనౌత్ కి సంబంధించిన ప్రైవేట్‌ ఫోటోలను చూపించాడు. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని కూడా కమల్‌ ఆర్ ఖాన్ చెత్త కామెంట్స్ చేశాడు. ఆ ఫోటోల గురించి సరైన సమయంలో అందరికి చెప్తాను అంటూ హృతిక్‌ రోషన్ చెప్పాడు. ఆ ఫోటోల గురించి ఇప్పటికి కూడా ఎందుకు చెప్పడం లేదు అంటూ కమల్‌ ఆర్ ఖాన్ ప్రశ్నించాడు. ఇప్పుడు అప్రస్తుతం అయిన విషయాన్ని ఇతడు పబ్లిసిటీ కోసమే తీసుకు వచ్చాడు అంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.