Begin typing your search above and press return to search.

కమల్‌ హెల్త్‌ బులిటెన్‌.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:07 PM IST
కమల్‌ హెల్త్‌ బులిటెన్‌.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు
X
యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్‌ కరోనా బారిన పడటం ఆయన అభిమానులకు కలవరపాటుకు గురి చేసింది. ప్రతి ఒక్కరు కూడా కమల్‌ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు.. ప్రార్థిస్తున్నారు. కమల్‌ కరోనాతో బాధ పడుతున్న కారణంగా మొన్నటి వీకెండ్ తమిళ బిగ్ బాస్ ఎపిసోడ్ ను రమ్యకృష్ణ హోస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. బిగ్ బాస్ మాత్రమే కాకుండా ఆయన విక్రమ్‌ సినిమా షూటింగ్ కు కూడా అంతరాయం కలిగింది. మరీ ఎక్కువ రోజులు ఇబ్బంది పడకుండా కమల్‌ హాసన్ పూర్తి ఆరోగ్యంగా మారాడు అంటూ హెల్త్‌ బులిటెన్ వచ్చింది. చెన్నై శ్రీరామ చంద్ర మెడికల్‌ సెంటర్ వారు కమల్‌ హాసన్ హెల్త్‌ కు సంబంధించిన బులిటెన్ ను విడుదల చేసి అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేశారు.

కమల్ కరోనా నుండి పూర్తిగా బయట పడ్డాడు. ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుం కమల్‌ హాసన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. మరో రెండు రోజుల్లోనే ఆయన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. డిసెంబర్ 4వ తారీకు నుండి ఆయన రెగ్యులర్‌ లైఫ్‌ లో బిజీ అవ్వచ్చు అంటూ కూడా వైధ్యులు పేర్కొన్నారు. కరోనా నెగటివ్‌ వచ్చింది కాని ఆయన మరో రెండు రోజుల పాటు ఆసుపత్రి వర్గాల వారి పర్యవేక్షణలోనే ఉండాల్సి ఉందని వైధ్యులు పేర్కొన్నారు. కరోనా నుండి చాలా స్పీడ్ గానే కమల్‌ హాసన్‌ తేరుకోవడం జరిగింది. ఇది అభిమానులకు మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి ఆనందంను కలిగిస్తుంది.

ప్రస్తుతం కమల్‌ హాసన్‌ తమిళంలో విక్రమ్‌ మూవీ లో నటిస్తున్నాడు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్స్ గ్లిమ్స్ వచ్చింది. సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసిన యూనిట్‌ సభ్యులు వచ్చే ఏడాదిలో విక్రమ్ ను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. కమల్‌ హాసన్‌ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో ఫాహద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతి నటించడం వల్ల అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. కమల్‌ హాసన్‌ ఈ సినిమా తర్వాత ఇండియన్ 2 ను మళ్లీ మొదలు పెట్టాల్సి ఉంది. ఇక కరోనా నుండి కోలుకున్న నేపథ్యంలో కమల్ హాసన్‌ వచ్చే వీకెండ్‌ తమిళ బిగ్‌ బాస్ ఎపిసోడ్‌ కు ఆయనే హోస్టింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.