Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ వ‌ర్సెస్ ర‌జ‌నీ‌.. యుద్ధం ఖాయ‌మేన‌ట‌?

By:  Tupaki Desk   |   12 April 2021 2:00 PM IST
క‌మ‌ల్ వ‌ర్సెస్ ర‌జ‌నీ‌.. యుద్ధం ఖాయ‌మేన‌ట‌?
X
ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో కొన‌సాగుతున్న హాట్ డిస్క‌ష‌న్ ఒక‌టే.. క‌మ‌ల్‌-ర‌జ‌నీ ఫైట్. ర‌జ‌నీకాంత్ అప్ క‌మింగ్ మూవీ ‘అన్నాతే’. ఈ సినిమా ఎన్నో అవాంత‌రాల న‌డుమ‌ ఆగుతూ సాగుతున్న సంగతి తెలిసిందే. ర‌జ‌నీ అనారోగ్యం, పొలిటిక‌ల్ ఎపిసోడ్ త‌ర్వాత ఈ మ‌ధ్య‌నే మొద‌లైన షూట్‌.. శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఇక‌పై ఎలాంటి విరామం లేకుండా సినిమా కంప్లీట్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట ర‌జ‌నీ.

అందుకు అనుగుణంగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసిన ద‌ర్శ‌కుడు శివ‌.. జోరుగా షూటింగ్ కొన‌సాగిస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాను రాబోయే దీపావ‌ళి సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ 4వ తేదీన ‘అన్నాతే’ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. లోకనాయకుడు క‌మ‌ల్ కూడా దీపావ‌ళికి రాబోతున్నాడ‌ట‌. క‌మ‌ల్ అప్ క‌మింగ్ మూవీ ‘విక్ర‌మ్‌’. అంతేకాదు.. 4వ తేదీనే ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతోంద‌ని అంటున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ర‌జ‌నీ-క‌మ‌ల్ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డి దాదాపు 16 సంవ‌త్స‌రాలు అవుతోంది. 2005లో వీరిద్ద‌రి సినిమాలు ఒకేసారి విడుద‌ల‌య్యాయి. ర‌జ‌నీ బాక్సాఫీస్ సంచ‌ల‌నం చంద్రముఖి, క‌మ‌ల్ హాస‌న్ ‘ముంబై ఎక్స్ ప్రెస్‌’ చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి ఈ స్టార్ వార్ కొన‌సాగనుంద‌ని అంటున్నారు. మ‌రి, ఇందులో నిజం ఎంత అన్న‌ది తేలాల్సి ఉంది.