Begin typing your search above and press return to search.

శ్రుతి సినిమాలేవీ నచ్చలేదు-కమల్‌

By:  Tupaki Desk   |   26 Jun 2015 11:05 AM IST
శ్రుతి సినిమాలేవీ నచ్చలేదు-కమల్‌
X
తమ పిల్లలు ఏం చేసినా బాగుందనే అంటారు కన్నవాళ్లు. అందులోనూ సినిమా వాళ్లయితే మరీనూ. ఎలా చేసినా అద్భుతం అనే అంటారు. కానీ కమల్‌ హాసన్‌ మాత్రం మొహమాటానికి కూడా కూతుర్ని పొగడలేదు. శ్రుతి హాసన్‌ నటించిన సినిమాల్లో మీకేది నచ్చింది? ఆమె ఎందులో బాగా చేసింది అంటే.. ఏదీ బాగా లేదంటూ కుండబద్దలు కొట్టేశాడు కమల్‌.

''నిర్మొహమాటంగా చెబుతున్నా. శ్రుతి ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ బాగా చేసినట్లు అనిపించలేదు. అసలు ఆమె నటించిన సినిమాలేవీ నచ్చలేదు. కొన్ని సినిమాలు చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. తన టాలెంట్‌ ఏంటో ఆమెకు తెలియట్లేదు. ఆ టాలెంట్‌కు తగ్గ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. నటిగా శ్రుతి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది'' అని చెప్పాడు కమల్‌.

శ్రుతిని తన నట వారసురాలిగా ప్రకటిస్తారా అంటే.. అది ఇప్పుడే చెప్పలేనన్నాడు. అది శ్రుతినే రుజువు చేసుకోవాలని.. తాను ఆ మాట అనలేనని కమల్‌ చెప్పాడు. శ్రుతి ఎప్పుడూ నటిగానే ఉంటుందో లేదో తాను చెప్పలేనని.. ఆమె తనకిష్టమైన సంగీతంలోకి వెళ్లిపోయినా వెళ్లిపోవచ్చని.. శ్రుతి నటిగానే ఉండాలని, తన నట వారసత్వాన్ని కొనసాగించాలని తాను బలవంతం చేయనని కమల్‌ అన్నాడు.