Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌: కమల్‌ బలవంతపు సరసం

By:  Tupaki Desk   |   24 May 2015 1:30 PM GMT
ఫస్ట్‌ లుక్‌: కమల్‌ బలవంతపు సరసం
X
ఉత్తమనటుడు కమల్‌హాసన్‌ ఏం చేసినా డిఫరెంటే. సినిమా సినిమాకి కొత్తదనం చూపించడం తనకి మాత్రమే అచ్చొచ్చిన విద్య. రొటీనిటీ అతడి డిక్షనరీలోనే లేదు. ప్రస్తుతం విశ్వరూపం 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే పాపనాశం రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈలోగానే 'చీకటిరాజ్యం' అంటూ మరో సంచలనానికి తెరలేపాడు.

ఇప్పటికే చీకటి రాజ్యం పోస్టర్‌లు నెట్‌లోకి వచ్చి హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పోస్టర్‌లో కమల్‌ బలవంతమైన కిస్‌ లాగించేస్తూనే, వెనుకనుంచి ముంచుకురానున్న విపత్తుపై ఓ కన్నేసి ఉంచాడు. అంటే ఎంత రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నా ఓ కన్నేసి ఉంచేంతటి టెన్షన్‌లు అతడికి ఉన్నాయని తెలియడమే ఈ పోస్టర్‌ ఉద్ధేశం. అయితే ముఖ్యంగా అసలు మనోడు అలా గాట్టిగా హగ్‌ చేసుకుంటున్నా ఈ అమ్మాయి ఎవరు? వెనుకనుండి చూస్తే త్రిష లాగే ఉంది.. ఇదే నాటు బలవంతపు సరసమండీ బాబూ..

చీకటిరాజ్యం చిత్రానికి విశ్వరూపం ఫేం గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఎస్‌.చంద్రహాసన్‌ నిర్మిస్తున్నారు. విజయ్‌ శంకర్‌, సాను జాన్‌ వర్గీస్‌ లాంటి నిపుణులైన టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.