Begin typing your search above and press return to search.
23 ఏళ్ల తర్వాత ఆగిపోయిన ఆ భారీ చిత్రంపై చర్చ
By: Tupaki Desk | 14 Nov 2020 12:00 PM ISTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా 1997 మరుధనాయగమ్ అనే సినిమా ప్రారంభం అయ్యింది. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో కమల్ హాసన్ ఆ సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమా ప్రారంభోత్సవంకు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ రావడంతో ఆ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యి ఉంటే హాలీవుడ్ మూవీ రేంజ్ లో కమల్ మూవీకి ఆధరణ లభించి ఉండేది. కాని పలు కారణాల వల్ల కమల్ ఆ సినిమాను వదిలేశాడు. ఆ తర్వాత సినిమాను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగినా కూడా అది సాధ్యం కాదని తేలిపోయింది.
ప్రస్తుతం కమల్ వయసు రీత్యా ఆ సినిమా చేయడం సాధ్యం కాదు. అప్పుడు లేని టెక్నాలజీ ఎంతో ఇప్పుడు వచ్చింది. కనుక ఖచ్చితంగా ఆ సినిమా మేకింగ్ చాలా ఈజీ అవుతుంది. అందుకే కమల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ బాధ్యతలను తమిళ సూపర్ స్టార్ విజయ్ కి అప్పగించే యోచనలో ఉన్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ్ హీరోగా భారీ బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉంది. అయితే విజయ్ నుండి ఇప్పటి వరకు స్పందన అయితే రాలేదు. కమల్ ఎలాంటి గెటప్ కు అయినా సూట్ అవుతాడు.
అఘోరా గెటప్ లో కూడా ఈ సినిమాలో హీరో కనిపించాల్సి ఉంది. మరి విజయ్ అలాంటి గెటప్ కు ఒప్పుకుంటాడా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చ అయితే తమిళ మీడియాలో జరుగుతుంది. 23 ఏళ్ల తర్వాత ఆ సినిమా గురించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందేమో అంటున్నారు.