Begin typing your search above and press return to search.
విశ్వనటుడి విశ్వదర్శనం రేపే
By: Tupaki Desk | 1 Aug 2018 2:01 PM ISTవిశ్వనటుడు కమల్ హాసన్ నటించిన `విశ్వరూపం 2` ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు - తమిళ్ - హిందీలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 5000 స్క్రీన్లలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే తమిళ్ - హిందీ వెర్షన్ల ప్రమోషన్ కమల్ హాసన్ అదరగొట్టేశారు. తెలుగులోనే ప్రమోషన్ కాస్తంత వీక్‌గా ఉందని చెప్పాలి.
అయితే రేపటి నుంచి ఐదు రోజుల పాటు కమల్ తెలుగుమీడియా తో నేరుగా ఇంటరాక్ట్ కానున్నారని తెలుస్తోంది. ఈ గురువారం సాయంత్రం నుంచి విశ్వనటుడి సంబరాలు హైదరాబాద్ లో మొదలు కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విశ్వరూపం2 తెలుగు వెర్షన్ ఆడియోని హైదరాబాద్ లో లాంచ్ చేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఈవెంట్ లో కమల్ హాసన్ అప్పియరెన్స్ అభిమానులకు పండగ తేనుంది. అపుడెపుడో `చీకటి రాజ్యం` రిలీజ్ టైమ్ లో కమల్ హైదరాబాద్ లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల గ్యాప్ వచ్చింది కాబట్టి అతడి అభిమానులు అంతే ఆసక్తిగా అతడి రాక కోసం వేచి చూస్తున్నారు. ఇక తీవ్రవాదం నేపథ్యంలో వచ్చిన విశ్వరూపం-1కి కొనసాగింపుగా ఈ సినిమా ఉండనుంది. ట్రైలర్లకు అద్భుత స్పందన వచ్చిన నేపథ్యంలో పార్ట్2పై భారీ అంచనాలేర్పడ్డాయి. `వశీం అన్సారీ కశ్మీరి` ఎవరో తేలే రోజు ఇంకెంతో దూరంలో లేదు.