Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ సినిమాకు 14న ముహూర్తం పెట్టారు

By:  Tupaki Desk   |   11 March 2022 7:34 PM IST
క‌మ‌ల్ సినిమాకు 14న ముహూర్తం పెట్టారు
X
ఖైదీ, మాస్ట‌ర్ వంటి విభిన్న‌మైన యాక్ష‌న్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్నారు యంగ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌స్తుతం లోక‌నాయ‌కుడు, యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ హీరోగా స‌రికొత్త యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కిస్తున్నారు. `విక్ర‌మ్`. ఇదే చిత్రాన్ని తెలుగులో `విక్ర‌మ్ హిట్ లిస్ట్` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు ఐదు భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ రిలీజ్ కానుంది. మార్చి 14న ఉద‌యం 7 గంట‌ల‌కు ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టిస్తామంటూ తాజాగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

శుక్ర‌వారం సాయంత్రం ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ కొత్త పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. రెడ్ క‌ల‌ర్ థీమ్ తో వున్న ఈ పోస్ట‌ర్ లో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో మెలితిప్పిన మీస క‌ట్టు, గ‌డ్డంతో తీక్ష‌ణంగా చూస్తూ చేతిలో క‌త్తి ప‌ట్టుకుని క‌నిపిస్తున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది. రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తూ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్‌, త‌మిళ వెర్ష‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి, శివాని నారాయ‌ణ‌న్‌, కాళిదాస్ జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఓ వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తి ప‌గా, ప్ర‌తీకారం నేప‌థ్యంలో ఈ మూవీని యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించారు. ఈ చిత్రాన్ని ముందు జ‌న‌వ‌రిలో పొంగ‌ల్ కానుక‌గా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల అది మార్చికి మారింది. అయితే మార్చిలోనూ భారీ చిత్రాల రిలీజ్ లు వుండ‌టంతో ఫైన‌ల్ గా `విక్ర‌మ్‌` రిలీజ్ ని ఏప్రిల్ కి షిఫ్ట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. త‌మిళ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం ఈ మూవీని ఏప్రిల్ 29న విడుద‌ల చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని వినిపిస్తోంది.

ఏప్రిల్ 14న య‌ష్ న‌టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` విడుద‌ల కాబోతోంది. ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలున్నాయి. ఫ‌స్ట్ పార్ట్ హ్యూజ్ హిట్ కావ‌డంతో సెకండ్ పార్ట్ ఎలా వుంటుందా? అనే చ‌ర్చ ఇప్ప‌టికే మొద‌లైంది. దీనికి పోటీగా రావ‌డానికి `విక్ర‌మ్‌` మేక‌ర్స్ అంత సుముఖంగా లేరు. ఇక ఇదే రోజు విజ‌య్ న‌టించిన `బీస్ట్‌` కూడా విడుద‌ల కాబోతోంది. ఈ రెండు చిత్రాల‌తో పోటీ ప‌డ‌టం క‌మ‌ల్ కు ఇష్టం లేద‌ట‌. ఆ కార‌ణంగానే ఈ మూవీ రిలీజ్‌ని ఏప్రిల్ కి మార్చార‌ని, ఏప్రిల్ 29న రిలీజ్ చేయ‌బోతున్నార‌ని, ఈ డేట్ ని ఈ 14న ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని చెబుతున్నారు.

అయితే ఇదే రోజు ఏప్రిల్ 29న మెగాస్టార్ `ఆచార్య‌` రిలీజ్ కు రెడీ అయిపోతోంది. చిరుతో క‌మ‌ల్ పోటీ ప‌డ‌బోతున్నార‌న్న‌ట‌మాట‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన `విక్ర‌మ్‌` చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు. గిరీష్ గంగాధ‌ర‌న్ కెమెరా, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ అందించ‌గా ఈ మూవీని ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. `గులాబీ` ఫేమ్ మ‌హేశ్వ‌రి, శివానీ శ్రీ‌వాస్త‌వ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.