Begin typing your search above and press return to search.
ముగ్గురు సూపర్ స్టార్స్.. నాన్ థియేట్రికల్ రైట్స్ 150 కోట్లు
By: Tupaki Desk | 1 March 2022 7:00 PM ISTఈమద్య సినిమా ఇండస్ట్రీలో అసలు కంటే కొసరు ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఒకప్పుడు థియేట్రికల్ రైట్స్ అనేది సినిమాకు ప్రథానమైన బిజినెస్. కాని ఇప్పుడు ఓటీటీ.. శాటిలైట్.. డబ్బింగ్ రైట్స్ ద్వారా భారీ మొత్తంలో నిర్మాతకు వస్తున్నాయి. తాజాగా యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా కు నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.
కమల్ హాసన్ చాలా కాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ లు దక్కించుకోలేక పోతున్నాడు. అయినా కూడా ఆయన నటిస్తున్న 'విక్రమ్' సినిమాకు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 150 కోట్ల రూపాయలు నిర్మాతకు వచ్చినట్లుగా తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 150 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేయడంతో బడ్జెట్ ఇప్పటికే తిరిగి వచ్చేసినట్లు అయ్యింది.
ఈ సినిమాకు ఇంత భారీగా బిజినెస్ జరగడానికి ప్రధాన కారణం కేవలం కమల్ హాసన్ మాత్రమే ఈ సినిమాలో నటించడం లేదు. ఆయనకు తోడుగా విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాసిల్ లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ స్టార్స్ పేర్లు చెప్పమంటే టాప్ టెన్ లోనే వీరిద్దరి పేర్లు ఉంటాయి. దేశ వ్యాప్తంగా వీరిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
విక్రమ్ సినిమా లో ముగ్గురు సూపర్ స్టార్స్ ఉండటంతో పాటు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. దాంతో ఈ సినిమా కు ఈ స్థాయి లో క్రేజ్ దక్కింది అనడంలో సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సౌత్ లో టాప్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నాడు. అందుకే ఆయన దర్శకత్వంలో నటించేందుకు కమల్ హాసన్ తో పాటు ఆ ఇద్దరు ఓకే చెప్పారు.
ఇంత మంది స్టార్స్ ఉన్నప్పుడు సినిమా ఆ రేంజ్ బిజినెస్ చేయకుండా ఎలా ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్ హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 37 కోట్ల రూపాయలను దక్కించుకున్నారట. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ వారు స్ట్రీమింగ్ కోసం కొనుగోలు చేయడం జరిగిందట. వారు పరిస్థితులను బట్టి థియేట్రికల్ స్క్రీనింగ్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక తమిళం.. తెలుగు.. ఇతర భాషల్లో స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థలు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 115 కోట్ల రూపాయలు ఓటీటీ మరియు శాటిలైట్ యూట్యూబ్ రైట్స్ ద్వారా వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ స్థాయి లో సినిమా పై అంచనాలు పెంచుకున్న ప్రేక్షకులు మరియు బయ్యర్లు సంతృప్తి చెందే విధంగా సినిమా ఉంటుందా అనేది చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. సమ్మర్ లో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి సాధ్యం అయ్యేనా చూడాలి.