Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ హాస‌న్ నుంచి ఫుల్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్?

By:  Tupaki Desk   |   11 May 2022 10:11 PM IST
క‌మ‌ల్ హాస‌న్ నుంచి ఫుల్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్?
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నుంచి ఫుల్ మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ ని ఈసారి ఆశించ‌వ‌చ్చా? అంటే.. అందుకు స‌మాధానంగా నిలుస్తోంది ఈ లిరిక‌ల్ సాంగ్. క‌మ‌ల్ హాస‌న్ - లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్ లో రానున్న `విక్ర‌మ్` ఆ లోటు తీర్చ‌నుందా? అంటే వేచి చూడాల్సిందే. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తెరకెక్కించిన `విక్రమ్` మూవీ నుంచి మొదటి పాట `పాతాల పాతాల` లిరికల్ వీడియో వైర‌ల్ గా మారింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ యాక్షన్-ప్యాక్డ్ టీజర్ తో భారీగా అంచనాలను పెంచింది. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన‌ ప్రచార కంటెంట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు టీమ్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది.

పాతాళ పాతాల పాట అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన‌ మాస్ పెప్పీ సాంగ్ ఆక‌ట్టుకుంటోంది. బీట్ అర‌బిక్ త‌ర‌హాలోనే దద్దరిల్లేలా ఉంది. పాటను విజువల్ గా చూసినప్పుడు ఎన‌ర్జిటిక్ గా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. కమల్ హాసన్ ఈ పాటలో డ్యాన్స్ మూవ్స్ తో తనలోని ఎన‌ర్జీని గ్రేస్ ని చూపించాడు. ముఖ్యంగా మాస్ అవ‌తార్ లో అత‌డి రూపం ఆక‌ట్టుకుంది. క‌మ‌ల్ కి ఈ త‌ర‌హా మాస్ సాంగ్ చాలా కాలం త‌ర్వాత ద‌క్కింది. ఈ పెప్పీ మాస్ సాంగ్ కి సాహిత్యం తో పాటు గానం అందించారు క‌మ‌ల్.

విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. స్టార్ కాస్ట్ తో పాటు.. ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్- నరైన్- అర్జున్ దాస్ - శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌గా గిరీష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ అందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.