Begin typing your search above and press return to search.
ఒక్క హిట్ తో లైన్ లోకి నాలుగు సినిమాలు
By: Tupaki Desk | 21 Aug 2022 9:00 PM ISTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ చాలా కాలం తర్వాత 'విక్రమ్' సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విక్రమ్ సినిమాకు సంబంధించిన హడావుడి కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారబోతున్నాడు.
విక్రమ్ విజయం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను ఈయన చేసేందుకు రెడీ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విక్రమ్ ఇచ్చిన నమ్మకంగా ఇండియన్ 2 సినిమాను పునః ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు. ఇండియన్ 2 ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసేలా దర్శకుడు శంకర్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇండియన్ 2 తర్వాత కమల్ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి అయిన రాఘవన్ సినిమా కు సీక్వెల్ ను చేయబోతున్నారట. ఇప్పటికే రాఘవన్ 2 కోసం స్క్రిప్ట్ రెడీ అయ్యిందని సమాచారం అందుతోంది. రాఘవన్ 2 సినిమా కోసం కమల్ హాసన్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అన్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఈ రెండు సినిమా లు మాత్రమే కాకుండా విక్రమ్ సినిమా కి కూడా సీక్వెల్ ఉంటుందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు. అయితే ఇప్పటికే కన్ఫర్మ్ అయిన విజయ్ సినిమా మరియు ఖైదీ 2 సినిమా ల తర్వాత విక్రమ్ 2 సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే కమల్ శభాష్ నాయుడు అనే సినిమా లో నటించాడు. ఆ సినిమా మధ్యలో ఉంది. ఆ సినిమాను కూడా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నాడు. మొత్తానికి విక్రమ్ సూపర్ హిట్ అవ్వడం వల్లే ఈ నాలుగు సినిమాలు ఇంత స్పీడ్ గా పట్టాలెక్కబోతున్నాయి అనేది తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీటిల్లో రెండు మూడు సక్సెస్ అయితే కమల్ మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యే అవకాశం ఉంది.