Begin typing your search above and press return to search.

దెయ్యాల మాంత్రికుడిగా లోక నాయకుడు

By:  Tupaki Desk   |   21 March 2016 4:13 AM GMT
దెయ్యాల మాంత్రికుడిగా లోక నాయకుడు
X
దెయ్యాల కామెడీ సినిమాలు ఇప్పుడు తెగ వచ్చేస్తున్నాయి. ఇందులోనే కొత్త జోనర్ ని ట్రై చేసేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే స్టార్ హీరోలు కూడా ఈ తరహా హారర్ కామెడీ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపుతుండడంతో.. ఇప్పుడీ కాన్సెప్ట్ పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఓ దెయ్యాల సినిమాని చేస్తుండడం విశేషం. కాకపోతే ఇది కేమియో మాత్రమే.

'మీంకుజాంబం మన్ పానయుం' అనే తమిళ్ మూవీలో కమల్ హసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రగాడిగా ఈయన పోషించే పాత్ర.. సినిమాను మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఒక శరీరంలో నుంచి ఆత్మను మరో శరీరంలోకి పరస్పరం మార్చే కేరక్టర్ ఇది. ఆత్మలను బంధించగలిగే శక్తి వంతుడుగా.. వాటి విద్యలు తెలిసిన మేథావిగా.. ఈ మూవీలో కమల్ పాత్ర స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు.

కాళిదాస్ జయరాం - అష్ణా జవేరి - ప్రభు - పూజా కుమార్ లు కీలక పాత్రలు పోశిస్తుండగా.. అముదీశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. శివాజీ గణేశన్ మనవడు దుష్యంత్ రామ్ కుమార్ - ఆయన భార్య నిర్మిస్తున్నారు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధంతో పాటు.. సెంటిమెంట్ - రొమాన్స్ ఈ మూవీలో పుష్కలంగా ఉంటాయట. సిటీ బ్యాక్ గ్రౌండ్ ఉండి.. గ్రామంలో నడిచే స్టోరీ ఇది అని తెలుస్తోంది.