Begin typing your search above and press return to search.

'రాఘవన్ -2' కోసం కమల్ హాసన్ సరసన బొమ్మాళి..?

By:  Tupaki Desk   |   29 March 2020 11:16 AM IST
రాఘవన్ -2 కోసం కమల్ హాసన్ సరసన బొమ్మాళి..?
X
'భాగమతి' మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. పూర్తిగా అమెరికాలో షూటింగ్ జరుపుకున్న 'నిశ్శబ్ధం' మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిఉంది. కరోనా వైరస్ కారణంగా పలు మూవీస్ తో పాటు ఈ మూవీ విడుదల కూడా వాయిదా పడింది. అనుష్క పై ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ బయటకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అనుష్క ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సీనియర్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ తమిళ మూవీ “వేట్టైయాడు విలైయాడు”(తెలుగు రాఘవన్ ) 2006 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.

ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందనుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందనున్న “వేట్టైయాడు విలైయాడు2” మూవీ లో హీరోయిన్ గా అనుష్క ఎంపిక అయ్యారని సమాచారం. ఇంతకముందు కూడా 'విన్నైతాండి వరువాయ్' (తెలుగులో 'ఏమాయచేసావే') చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న మూవీ కోసం గౌతమ్ మీనన్ అనుష్క ని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం పై స్పందించిన అనుష్క.. గౌతమ్ మీనన్ ఎప్పుడు పిలిచినా కాల్ షీట్స్ తో సంబంధం లేకుండా ఆయన మూవీలో యాక్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది. లేటెస్టుగా 'రాఘవన్ 2' స్టోరీ అనుష్క కి చెప్పగా ఓకే చేసిందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కమల్ హాసన్ 'ఇండియన్ 2' చిత్ర షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం.