Begin typing your search above and press return to search.
`విశ్వరూపం2` వాయిదా లేదు- కమల్
By: Tupaki Desk | 6 Aug 2018 12:03 PM ISTఉలగనాయగన్ కమల్ హాసన్ నటించిన `విశ్వరూపం 2` ఆగస్టు 10న రిలీజ్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కి అద్భుత స్పందన రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తికర చర్చ ఫ్యాన్స్ లో సాగుతోంది. మరోవైపు ఈ సినిమా తమిళ రిలీజ్ ని సవాల్ చేస్తూ పిరమిడ్ సైమరా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకెక్కడంతో వాయిదా తప్పదనే భావించారంతా. అయితే దీనిపై విశ్వనటుడు కమల్ హాసన్ స్వయంగా ఓ క్లారిటీనిచ్చారు.
`విశ్వరూపం 2` రిలీజ్ వాయిదా పడలేదు. తెలుగు - తమిళ్ లో ముందుగా ప్రకటించినట్టే ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక వివాదాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని `ఆస్కార్ ఫిలింస్` ద్వారా కమల్ హాసన్ రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈరోజు కోర్టులో కమల్ వివరణ ఇవ్వాల్సి ఉంది. అంతకుముందే తన సినిమా రిలీజ్ వాయిదా పడదని కమల్ ప్రకటించడంతో ఆయన వ్యాఖ్యానంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. కోర్టు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందోనన్న చర్చా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
విశ్వరూపం చిత్రానికి తాజా సినిమా కొనసాగింపుగా తెరకెక్కింది. ఇందులో ప్రతి పాత్రను డీటెయిల్డ్ గా చూపిస్తున్నామని కమల్ తెలిపారు. అసలు విదేశాల్లో ఒక క్లాసికల్ డ్యాన్సర్ గా తన పాత్ర ఎందుకు ప్రవర్తిస్తుందో పార్ట్2లో చూపించామని, పూజా కుమార్ తన భార్యగా కనిపిస్తుందా .. లేక ఇంకేదైనా రహస్యం దాగి ఉందా.. ఆ పాత్ర పరమార్థం ఏంటి? అన్నది చూడాలనుకుంటే థియేటర్ కి రావాల్సిందేనని కమల్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆండ్రియా పాత్ర హైలైట్ గా ఉంటుందని తెలిపారు. `విశ్వరూపం 2` ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ సినిమాని వీక్షించేందుకు కమల్ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్ సైతం ఎగ్జయిటింగ్ గా ఉన్నారనడంలో సందేహం లేదు. మరో నాలుగు రోజుల్లోనే సినిమా థియేటర్లలోకి వస్తోంది. టిల్ దెన్ వెయిట్ & వాచ్ దిస్ స్పేస్..