Begin typing your search above and press return to search.

కమల్ మనసులో మరో సీక్వెల్

By:  Tupaki Desk   |   26 Sept 2018 7:35 PM IST
కమల్ మనసులో మరో సీక్వెల్
X
లోక నాయకుడు కమల్ హాసన్ తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన భారతీయడు సీక్వెల్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు శంకర్ లొకేషన్ల వేట పూర్తి చేసి మిగిలిన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిందో రెండో భాగం అక్కడి నుంచే కంటిన్యూ అయ్యేలా శంకర్ పక్కాగా స్క్రిప్ట్ రాసుకున్నాడట. అంతేకాదు శంకర్ సినిమాల్లో మొదటిసారి విదేశాల్లో షూటింగ్ మొదలుపెట్టిన సినిమాగా సైతం ఇది ప్రత్యేకంగా నిలవబోతోంది.

తాజా అప్ డేట్ ప్రకారం కమల్ కు తనదే మరో బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ తీయాలని మనసులో ఉందట. అదే 1992లో వచ్చిన తేవర్ మగన్. తెలుగులో క్షత్రియ పుత్రుడు పేరుతో డబ్ అయ్యి ఇక్కడ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శివాజీ గణేశన్-రేవతి-నాజర్-గౌతమిలు నటించిన ఆ మూవీలో బారెడు మీసాలు పెట్టుకుని ఊరి పెద్దరికాన్ని భుజాన వేసుకున్న పాత్రలో కమల్ చెలరేగిపోయాడు. గ్రామ కక్షలను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన సినిమాల్లో క్షత్రియ పుత్రుడిది ప్రత్యేక స్థానం. దీనికి సీక్వెల్ చేయాలనుందని కమల్ తన స్నేహితులతో అన్నట్టు కోలీవుడ్ టాక్.

ఇదీ మంచి ఆలోచనే. రేవతి గారు ఎలాగూ ఉన్నారు. గౌతమి పాత్రకు ఫస్ట్ పార్ట్ లోనే ఫినిషింగ్ టచ్ ఇచ్చేసారు కాబట్టి దీంట్లో అవసరం పడకపోవచ్చు. వడివేలు అందుబాటులో ఉన్నాడు. నాజర్ పాత్ర చనిపోయింది కానీ ఆయన కొడుకుగా మరో నాజర్ ని చూపించేస్తే సరిపోతుంది. ఒకరు ఇద్దరు తప్ప అందులో పాత్రధారులంతా బ్రతికే ఉన్నారు. సో కమల్ ఐడియా వర్క్ అవుట్ చేయొచ్చు. అప్పటి వెర్షన్ కు భరతన్ దర్శకత్వం వహించగా ఆయన ఈ సినిమా వచ్చిన ఆరేళ్లకే 1998లో చనిపోయారు. సో ఇప్పుడు దీని సీక్వెల్ ని టేకప్ చేసే డైరెక్టర్ ని సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదు.

విశ్వరూపం 2 తీవ్రంగా నిరాశపరిచిన నేపధ్యంలో భారతీయుడు 2తో పాటు తన రాజకీయ జీవితానికి ఇబ్బంది కలగని సినిమాలనే ఎంచుకునేందుకు కమల్ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో క్షత్రియ పుత్రుడు సీక్వెల్ ఎంత వరకు కార్య రూపం దాల్చుతుంది అనేది వేచి చూడాలి.