Begin typing your search above and press return to search.
విశ్వరూపం సైలెన్స్ కి అర్థం?
By: Tupaki Desk | 2 Aug 2018 10:58 AM ISTకోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత అంత క్రేజ్ ఉన్న నటుడు కమల్ హాసన్. విజయ్-అజిత్ తర్వాతి తరంగా పరిగణించబడతారు కాబట్టి కౌంట్ లోకి తీసుకోవడం లేదు. సాధారణంగా కమల్ సినిమా ఏదైనా వస్తోంది అంటే తమిళనాట మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి సందడి కనిపిస్తుంది. కారణం జానర్ తో సంబంధం లేకుండా కమల్ అందరికి కనెక్ట్ కావడమే. కానీ విచిత్రంగా విశ్వరూపం 2 విషయంలో మాత్రం కొంచెం కూడా హడావిడి లేకపోవడం ఫ్యాన్స్ లోనే అనుమానాలు రేపుతోంది. విడుదలకు మరో 8 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇవాళ ఆడియో వేడుక అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు కానీ అధిక శాతం ప్రేక్షకులకు దాని గురించిన సమాచారం కూడా లేదు.
ఈ నేపథ్యంలో విశ్వరూపం 2 విషయంలో కమల్ హాసన్ ఎందుకింత నిర్లిప్తంగా ఉన్నాడు అనే అనుమానం రాకమానదు. దీని ప్రమోషన్ కోసం నిన్న ప్రత్యేకంగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన కమల్ అరగంట కంటే ఎక్కువసేపు ఉండలేకపోయాడు. నిజానికి విశ్వరూపం మొదటి భాగం విడుదలైనప్పుడు ఉన్న పరిస్థితులను గుర్తుకు చేసుకుంటే దానికి పూర్తి భిన్నంగా ఇప్పటి పోకడ ఉండటం గమనించవచ్చు. తమిళ్ కంటే ముందు తెలుగులో విడుదల చేసినప్పుడు దీని మీద అల్లుకున్న వివాదాలు పబ్లిసిటీ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పేరు వచ్చింది కానీ ప్రాఫిటబుల్ వెంచర్ గా మాత్రం మిగల్లేదు. అంతకు ముందు కమల్ సినిమాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. అందుకే వాటి బాకీలు పూడ్చడం కోసం విశ్వరూపం 2 విడుదల చేస్తున్నారు కాబట్టి మొక్కుబడిగా హైప్ సృష్టిస్తున్నారు అని ఇన్ సైడ్ టాక్.
అసలే తెలుగులో విపరీతమైన పోటీ ఉంది. విశ్వరూపం 2 ముందు రోజు శ్రీనివాస కళ్యాణం రానుండగా ఆ తర్వాత వారం తిరక్కుండానే గీత గోవిందుల అల్లరి మొదలవుతుంది. వీటికి ధీటుగా నిలవాలి అంటే విశ్వరూపం 2లో చాలా విషయం ఉండాలి. పైగా రెండు గంటలు మాత్రమే నిడివి ఉన్న విశ్వరూపంలో అంత క్రిస్పీగా ఏం చూపించి ఉంటారు అనేదాని మీదే దీని సక్సెస్ ఆధారపడి ఉంది. గుట్టుచప్పుడు కాకుండా వస్తున్న మొదటి కమల్ హాసన్ సినిమాగా విశ్వరూపం 2నే చెప్పొచ్చు.