Begin typing your search above and press return to search.
లేటు వయసులో అదరగొడుతున్న కమల్
By: Tupaki Desk | 9 Jun 2022 7:00 AM ISTకమల్ హాసన్ కెరీర్ ప్రారంభం నుంచి ప్రయోగాలు చేస్తూనే వున్నారు. కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తిన్నా ఆ తరువాత కొన్ని సినిమాలు ఆయనకు ప్రశంసలు అందించాయి. ఫార్ముల చిత్రాలకు పూర్తి భిన్నంగా నిత్య ప్రయోగాల హీరోగా హీరోగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న కమల్ హాసన్ చేయని ప్రయోగం లేదు. చేయని పాత్ర లేదు. అంతగా కొత్త పుంతలు తొక్కించిన కమల్ ఏకంగా పది పాత్రలలో `దశావతారం` మూవీ చేసి ఆశ్చర్యపరిచారు.
`విశ్వరూపం 2` తరువాత కమల్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో అన్నేళ్ల విరామం తరువాత ఆయన నుంచి వచ్చిన చిత్రం `విక్రమ్`. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ నాలుగేళ్ల విరామం తరువాత కమల్ కు మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది.
కెరీర్ ప్రారంభం నుంచి హీరోయిజమ్ లెక్కలు వేసుకోకుండా ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తూ వస్తున్న కమల్ హాసన్ `విక్రమ్`కి కూడా ఆ లెక్కలు వేసుకోకుండా కొత్తదారిలో ఈ మూవీ చేశారు. ఈ సినిమాతో చాలా మంది సీనియర్ హీరోలకు మంచి పాఠాన్ని నేర్పారని చెప్పొచ్చు. `విక్రమ్` సినిమాలో కమల్ ఫస్ట్ హాఫ్ కి ముందు కనిపిస్తారు. అంత వరకు కథ అంతా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ చుట్టే తిరిగుతూ వుంటుంది. ఫైనల్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి కమల్ అసలు కథని మొదలు పెడతారు.
స్ట్రెయిట్ గా చెప్పాలంటే ఈ మూవీతో రూల్స్ బ్రేక్ చేయడమే కాకుండా సీనియర్ హీరోలకు కొత్త దారిని చూపించారు. ఒక సినిమాలోని కథ మొత్తం తనపైనే నడవాలని ప్రతీ హీరో అనుకుంటారు. కానీ కమల్ మాత్రం విక్రమ్ సినిమాతో ఆ రూల్స్ ని బ్రేక్ చేసి సరికొత్త ఫార్ములా సినిమాలకు తెరలేపారు. యాభై ఏళ్లు నిండిన హీరోలకు `విక్రమ్` విజయం ఓ పాఠం అని నిరూపించి సరికొత్త చర్చకు కమల్ తెరతీశారు. ఇదిలా వుంటే రిలీజ్ రోజు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ విజయవంతంగా ముందుకు సాగుతోంది.
ఇక యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 2 డాలర్ల ని రాబట్టి ఆకట్టుకుంటోంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ల నటన చివరి 3 నిమిషాల్లో రోలెక్స్ పాత్రలో కనిపించే సూర్య ఆహార్యం, తనపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తోంది. ఈ మూవీ సాధిస్తున్న వసూళ్లని చూసిన వాళ్లంతా లేటు వయసులో కమల్ అదరగొడుతున్నాడుగా అంటే కామెంట్ లు చేస్తున్నారు. నాలుగేళ్ల విరామం తరువాత కొత్త ఫార్ములా చిత్రాలకు శ్రీకారం చుట్టిన కమల్ ని ఎంత మంది సీనియర్ హీరోలు ఫాలో అవుతారో చూడాలి.