Begin typing your search above and press return to search.

దేవ‌గ‌ణ్‌ పై భార‌తీయుడి క్లారిటీ..

By:  Tupaki Desk   |   28 Aug 2018 4:31 AM GMT
దేవ‌గ‌ణ్‌ పై భార‌తీయుడి క్లారిటీ..
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో భార‌తీయుడు 2 చిత్రానికి స‌న్నాహాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్‌ - ర‌వివ‌ర్మ‌న్ (డీవోపీ) బృందం లొకేష‌న్ల వేట‌తో యుద్ధం షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. 2.ఓ రిలీజ్ న‌వంబ‌ర్‌ లో ప‌క్కా అని క‌న్ఫామ్ చేసుకున్న శంక‌ర్ ఇక త‌దుప‌రి సినిమా గురించి సీరియ‌స్‌గా బ‌రిలో దిగ‌డం అభిమానుల్లో ఆనందం నింపింది.

దాదాపు 22 ఏళ్ల త‌ర్వాత భార‌తీయుడు సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నార‌న్న వార్త .. అటు తమిళ్‌ - ఇటు తెలుగు రెండుచోట్లా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్ర‌స్తుత స‌న్నివేశంలో రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? రాజ‌కీయ‌నాయ‌కుల దందాలేంటి? అన్న‌దానిపైనా, రాజ‌కీయ నాయ‌కుల దారుణ అవినీతిపైనా ఈసారి భార‌తీయుడు గురిపెట్ట‌నున్నాడ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇదో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్. ఇందులో బాలీవుడ్ న‌టుడు అజ‌య్‌దేవ‌గ‌ణ్ ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తారు? అన్న‌దానికి విశ్వ‌నటుడు క‌మ‌ల్ హాస‌న్ నుంచి స‌మాధానం వ‌చ్చింది.

ఈ చానెల్ ఇంట‌ర్వ్యూలో క‌మ‌ల్ హాస‌న్ మాట్లాడుతూ ... అల్టిమేట్‌ గా అది ద‌ర్శ‌కుడి పిలుపు మేర‌కే ఏదైనా ఉంటుంద‌ని ఇదివ‌ర‌కే చెప్పాను... అని అన్నారు. అంటే క‌మ‌ల్ మాట‌ల్ని బ‌ట్టి ఇప్ప‌టికే అజయ్‌ దేవ‌గ‌ణ్ ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతున్నార‌నే అర్థం అవుతోంది. అయితే అజ‌య్ ఇప్ప‌టికే ప‌లు భారీ బాలీవుడ్ ప్రాజెక్టుల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నాడు. వాటి నుంచి కాల్షీట్లు స‌ర్ధుబాటు చేసుకుని శంక‌ర్ కోసం పూర్తి స‌మ‌యాన్ని కేటాయించాల్సి ఉంటుంది. క‌మ‌ల్ హాస‌న్‌ - యాక్ష‌న్‌ దేవ‌గ‌ణ్ ఇద్ద‌రినీ ఒకే ఫ్రేమ్‌ లో చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోవ‌డం ఖాయం అని అర్థ‌మ‌వుతోంది. మొత్తానికి జేగంట మోగింది. ఇక ర‌ణ‌యుద్ధ‌మే!!