Begin typing your search above and press return to search.

60ఏళ్ల నాటి ఇంట్లో క‌మ‌ల్ హాస‌న్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్..!

By:  Tupaki Desk   |   19 Aug 2021 10:00 PM IST
60ఏళ్ల నాటి ఇంట్లో క‌మ‌ల్ హాస‌న్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్..!
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌జీవితం భార‌తీయ సినీచ‌రిత్ర పుట‌ల్లో ఒక ప్ర‌త్యేక‌మైన అధ్యాయం. ఆ కుటుంబం అంతా క‌ళాకారుల‌మ‌య‌మే. సోద‌రుడు చారు హాస‌న్.. సుహాసిని మ‌ణిర‌త్నం .. శ్రుతిహాస‌న్.. అక్ష‌ర‌హాస‌న్.. హారిక త‌దిత‌రులు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద స్టార్లు.

ఇప్పుడు హాస‌న్ కుటుంబం ఒకే ఫోటోఫ్రేమ్ లో క‌నిపించారు. ఇది అరుదైన చిత్రం. దీనిని సుహాసిని మణిరత్నం తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. కమల్ హాసన్ తో కలిసి పెరిగిన తన పాత‌ ఇంటి ఫోటోల‌ను సుహాసిని పంచుకున్నారు. ఈ ఫోటోల‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేసారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. హాసన్ కుటుంబం చాలా నెలల తర్వాత వారి సొంత‌ ఇంటికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. 60 సంవత్సరాలకు పైగా ఉన్న ఆ ఇంటిని ఇటీవ‌ల పున‌ర్మించారు. భారీ మార్పులు చేయించారు. జ్ఞాప‌కాల్ని కూల్చేయ‌కుండా త‌మ కుటుంబానికి గుర్తుగా ఉన్న ఇంటిని తిరిగి నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేసారు.

``చెన్నై ఎల్డామ్స్ రోడ్ లోని మా ఇంటికి ఇంటికి తిరిగి వ‌చ్చాం. అంద‌రు ప్రకాశవంతమైన హసన్ లు`` అంటూ వ్యాఖ్య‌ను ఈ ఫోటోకి సుహాసిని జోడించారు. ఫోటోలో ఉన్న‌ కుటుంబ సభ్యుల‌ను పరిచయం చేశారు. సుహాసిని- కమల్- చారు హసన్- కోమలం- డాక్టర్ నందిని బాషిని (స్టాండింగ్) అను (రాధ) -గౌతమ్- అక్షర హాస‌న్ అంటూ వివ‌రాల్ని వెల్ల‌డించారు.

సుహాసిని కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. చివరిగా తమిళ్ ఆంథాలజీ పుతం పుదు కాలైలో కనిపించారు. ఇందులో ఆమె ఒక విభాగానికి దర్శకత్వం వహించారు. ఆమె భర్త మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న త‌దుప‌రి తమిళ చిత్రం `పొన్నియిన్ సెల్వన్‌`లో కూడా సుహాసిని భాగ‌మ‌య్యారు.

గత సంవత్సరం సుహాసిని తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో మణిరత్నంతో చాట్ సెషన్ నిర్వహించారు. చాలా మంది అభిమానులు ప్రశ్నలతో కూడుకున్న‌ వీడియోలను పంపారు. వాటిలో కొన్నింటికి ఫిల్మ్ మేకర్ మ‌ణిర‌త్నం సమాధానమిచ్చారు. అభిమానులతో పాటు లైవ్ సెషన్ లో ఆర్ మాధవన్.. అదితి రావు హైదరి.. ఖుష్బు సుందర్ తదితరులు పాల్గొన్నారు.

న‌టుడు మాధవన్ గోల్ఫ్ ని పరిచయం చేయడం ద్వారా మణిరత్నం జీవితాన్ని మార్చినట్లు సుహాసిని ఈ వీడియోలో వెల్ల‌డించారు. ఆటలో తనను ఓడించమని మణిరత్నంను ఎలా సవాల్ చేస్తాడో కూడా ఈ వీడియోలో మాధవన్ చమత్కరించారు.