Begin typing your search above and press return to search.
బిగ్ బాస్2.. కొత్త ప్రోమో అదిరింది
By: Tupaki Desk | 22 May 2018 10:27 AM ISTరియాలిటీ షో బిగ్ బాస్ సెన్సేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక వెర్షన్స్ కు కూడా అద్భుతమైన స్పందన లభించడంతో.. పలు ప్రాంతాలలో సీజన్ 2 స్టార్ట్ కాబోతోంది. తెలుగులో తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. ఇప్పుడు ఆ బాధ్యతలు నాని చేతిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తమిళ్ లో మాత్రం కమల్ హాసన్ కంటిన్యూ అవుతున్నారు.
ఇప్పుడు బిగ్ బాస్ సీజన్2 కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. డిఫరెంట్ కంటెంట్ తో రాబోతోన్న విషయాన్ని ఈ ప్రోమోలో చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. చూసేందుకు కాసింత దూకుడుగా కనిపిస్తున్న ఓ కుర్రాడు.. హఠాత్తుగా ఒక మహిళను ఢీకొట్టి వెళ్లిపోతూ ఉంటాడు. దీన్ని చూసిన చుట్టుపక్కల ఉన్నవాళ్లు అతడిని ఏదో అనబోతుండగా.. ఆపేయమంటూ చిటికేస్తారు కమల్ హాసన్. ప్రతీ సంఘటన వెనకా.. కంటికి కనిపించే కోణం మాత్రమే కాదని.. ఇంకా లోతుల్లోకి చూడాల్సి ఉంటుందని చెబుతారు కమల్.

తీరా అక్కడ సిట్యుయేషన్ ఏంటంటే.. అలా పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ చిన్నారిని కారు కింద పడకుండా కాపాడతాడు ఆ కుర్రాడు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కంటికి కనిపించని మ్యాటర్ ఏంటో తెలుసుకుంటేనే.. అసలు విషయం అర్ధం అవుతుందని చెబుతూ.. కమల్ హాసన్ ముక్తాయింపునివ్వడం బాగుంది. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్2ను.. కమల్ హాసన్ విభిన్నంగానే రన్ చేయబోతున్నారు.